IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 మ్యాచ్ లో సెప్టెంబర్ 21న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెటర్ టీమిండియా అభిమానులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు.అంతే కాదు.. ఆపరేషన్ సింధూర్ ని కూడా అవమానించాడు. దీంతో బీసీసీఐ పాకిస్తాన్ ఆటగాడు హారిస్ రవూఫ్ పై ఫిర్యాదు చేసింది. దీంతో పాకిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. హారిస్ రవూఫ్ పై మూడు మ్యాచ్ ల పాటు నిషేదం విధించారు. ముఖ్యంగా క్రికెట్ గ్రౌండ్ వారి రిఫరెన్స్ లు తీసుకొచ్చినందుకు.. అలాగే అభిమానులతో అనుచితంగా ప్రవర్తించినందుకు మ్యాచ్ నుంచి 100 శాతం మ్యాచ్ ఫీజుతో పాటు హారిస్ రౌఫ్ పై ఐసీసీ 3 మ్యాచ్ ల నిషేదం విధించినట్టు సమాచారం. దీంతో ఈనెల 28న జరిగే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కి హారిస్ రవూఫ్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
మరోవైపు సూపర్ 4 మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ కాస్త ఓవర్ యాక్ట్ చేశాడు పాకిస్తాన్ బౌలర్ హరీస్ రఫ్. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ… రాఫెల్ జెట్ ను కూల్చేసామని అర్థం వచ్చేలా సిగ్నల్స్ ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తాము భారత రఫెల్ ను కూల్చేశామని పాకిస్తాన్ అబద్ధాలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలోనే సంజూ వికెట్ తీసిన తర్వాత భారత రఫెల్ జెట్ ను కూల్చి వేసామని కౌంటర్ ఇచ్చాడు హారిస్ రవూఫ్. భారత రఫెల్ జెట్ ను కూల్చి వేసామని హరీస్ రఫ్ అన్న తరుణంలోనే.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు టీమిండియా అభిమానులు. పాకిస్తాన్ బౌలర్ హరీస్ రఫ్ ను ఉద్దేశించి కోహ్లీ కోహ్లీ అంటూ… అభిమానులు రచ్చ రచ్చ చేశారు. ఇక వాళ్లు అరుస్తుంటే వెంటనే రియాక్ట్ అయిన పాకిస్తాన్ బౌలర్ హరీస్ రఫ్… తనకేం వినిపించడం లేదు అన్నట్లుగా వ్యవహరించారు. చెవులను చూపిస్తూ.. ఏదో అన్నాడు. అయితే అంతకుముందు అభిషేక్ శర్మతో హరీస్ రఫ్ గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో ( Asia Cup 2025 ) నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిoడియా ఘన విజయం సాధించింది. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే మ్యాచ్ జరుగుతున్న క్రమంలో… టీమిండియా ప్లేయర్ల ను గెలికాడు పాకిస్తాన్ ఆటగాడు రవూఫ్.. ముఖ్యంగా అభిషేక్ శర్మను ఏదో బూతులు తిడుతూ.. రెచ్చిపోయాడు. అయితే… దానికి అభిషేక్ శర్మ వెంటనే కౌంటర్ ఇచ్చాడు. ఏ పోరా.. నువ్వేంట్రా.. ఏం చేయలేవు అనేలా స్పందించాడు. అలాగే… షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో మొదటి బంతికే సిక్స్ కొట్టి… చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ.