BigTV English

Rs 1.50 Lakh Discount on Mahindra XUV700: ఈ మహీంద్రా కారు కొనుగోలుపై ఏకంగా రూ.1.50 లక్షల డిస్కౌంట్.. చివరి తేదీ ఇదే!

Rs 1.50 Lakh Discount on Mahindra XUV700: ఈ మహీంద్రా కారు కొనుగోలుపై ఏకంగా రూ.1.50 లక్షల డిస్కౌంట్.. చివరి తేదీ ఇదే!
Mahindra XUV700
Mahindra XUV700

Rs 1.50 Lakhs Discount on Mahindra XUV700 Car: ఈ ఏడాదిలో కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. 7 సీటర్ కొత్త కారుపై కళ్లు చెదిరే డిస్కౌంట్ పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ప్రముఖ దేశీయ వాహన తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి మార్కెట్‌లో మంచి ప్రజాదరణ ఉంది. ఈ కంపెనీ నుంచి కొత్త కార్లు లాంచ్ అవుతున్నాయంటే కస్టమర్లు ముందుగానే బుకింగ్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కాగా ఈ కంపెనీ నుంచి ఇదివరకే లాంచ్ అయిన ‘ఎక్స్​యూవీ700’ (XUV700) మోడల్ అద్భుతమైన అమ్మకాలతో దూసుకుపోతుంది.

ఇప్పుడీ మోడల్‌పై కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ కారు అమ్మకాలను మరింత పెంచడానికి కంపెనీ ఏకంగా రూ.1.50 లక్షల డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ద్వారా మరికొంత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ నెల ఆఖరు వరకు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది.


Also Read: మారుతి కార్లపై భలే ఆఫర్లు.. ఇక జాతరే జాతర!

అందువల్ల ఎక్స్‌యూవీ 700 కారును కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ కారు మీద అందిస్తున్న ఈ తగ్గింపు కేవలం 2023 మోడల్స్ పైన మాత్రమే వర్తిస్తాయి. అంతేకాకుండా రూ.1.50లక్షల డిస్కౌంట్ అనేది క్యాష్ డిస్కౌంట్ రూపంలో పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపులు వంటివి అందుబాటులో ఉండవు. ఈ ఆఫర్స్ 7సీటర్‌ మోడల్‌పై వర్తిస్తాయి.

దీంతోపాటు 5సీటర్ మోడల్‌పై రూ.1.30 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారులో ఎల్ఈడీ టెయిల్ లైట్స్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, రూప్ రెయిల్స్, షార్క్ పిన్ యాంటెన్నా, స్కిడ్ ప్లేట్స్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది.

Also Read: Ather Rizta: ఏథర్ రిజ్టా లక్షల ధరతో లాంచ్ అయింది.. కానీ నాణ్యతపై ఫోకస్ పెట్టలేదా..!

డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 60 కంటే ఎక్కువ కార్ కనెక్టెడ్ ఫీచర్స్‌తో వచ్చింది. యాంబియంట్ లైటింగ్, వాయిస్ అసిస్ట్, పవర్డ్ ఆపరేట్ వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

Tags

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×