BigTV English

Ather Rizta Bike Review: లక్షల ధరతో లాంచ్ అయిన ఏథర్ రిజ్టా.. కానీ నాణ్యతపై ఫోకస్ పెట్టలేదా..?

Ather Rizta Bike Review: లక్షల ధరతో లాంచ్ అయిన ఏథర్ రిజ్టా.. కానీ నాణ్యతపై ఫోకస్ పెట్టలేదా..?
Ather Rizta
Ather Rizta

Ather Rizta Electric Scooter Review: మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ కంపెనీలు కొత్త మోడళ్లలో.. రకరకాల వేరియంట్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు అప్డేటెడ్ వెర్షన్లతో సరికొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చాయి. అయితే తాజాగా ఏథర్‌ ఎనర్జీ తన సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూర్‌ రిజ్టాను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.


ఇందులో అతి పెద్ద సీటింగ్‌ సౌకర్యం, స్టోరేజ్‌ స్పేస్‌తో ఫ్యామిలీ స్కూటర్‌గా ఏథర్ రిజ్టాను విడుదల చేసింది. దీనికి సంబంధించిన బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. కంపెనీ ఈ స్కూటర్‌ని రూ.1.10 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో రిలీజ్ చేసింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో రిలీజ్ అయినప్పటికీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొన్ని చోట్ల నాణ్యత లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది.

దీని స్క్రీన్ చుట్టూ ఫినిషింగ్ బాగాలేనట్లు కొందరు చెబుతున్నారు. ఏథర్ 450తో పోలిస్టే ఫిట్టింగ్ అస్సలు ఏం బాగాలేదని అంటున్నారు. అంతేకాకుండా ఇతర ఏథర్ స్కూటర్లతో పోలిస్తే.. హ్యాండిల్ బార్‌లోని స్విచ్‌గేర్, బటన్‌ల నాణ్యతలో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్లాస్టిక్ ఫినిషింగ్‌‌లో కూడా కాస్త రాజీపడినట్లు సమాచారం.


Also Read: ఏప్రిల్ 24న అల్ట్రావయోలెట్ నుంచి కొత్త బైక్.. దేశంలో ఇదే అత్యంత వేగవంతమైన ఈవీ!

ఇది మిడ్ డ్రైవ్ మోటారును కలిగి ఉంది. దీని శక్తి 450 రేంజ్ స్కూటర్ కంటే తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రిజ్టాలో ‘ర్యాప్’ రైడ్ మోడ్ కూడా అందుబాటులో లేదు. ఇక దీని పూర్తి స్పెసిఫికేషన్ వివరాల విషయానికొస్తే.. ఇది రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది.

అందులో 2.9 kWh బ్యాటరీ పూర్తి ఛార్జింగ్‌పై 123 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. అలాగే 3.7 kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జింగ్‌పై 160 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ రెండు స్కూటర్ల బ్యాటరీ సామర్థ్యం వరుసగా 2.88 kWh, 3.04 kWhగా ఉన్నాయి. కొత్త ఏథర్ రిజ్టాలో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి.

Also Read: Ultraviolette EV Launch Date: ఏప్రిల్ 24న అల్ట్రావయోలెట్ నుంచి కొత్త బైక్.. దేశంలో ఇదే అత్యంత వేగవంతమైన ఈవీ!

బ్రేకింగ్ కోసం.. ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు అందించబడ్డాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది ఏథర్ 450 రేంజ్ కంటే ఎక్కువ. అంతేకాకుండా.. 22 లీటర్ల ఫ్రంక్ కూడా అందించబడింది. ఈ స్కూటర్ 400ఎమ్ఎమ్ వరకు నీటిలో నడుస్తుందని కంపెనీ పేర్కొంది.

Tags

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×