BigTV English

Maruti Suzuki Offers : మారుతి కార్లపై భలే ఆఫర్లు.. ఇక జాతరే జాతర!

Maruti Suzuki Offers : మారుతి కార్లపై భలే ఆఫర్లు.. ఇక జాతరే జాతర!
Maruti Suzuki Offers
Maruti Suzuki Offers

Maruti Suzuki Offers : దేశంలో కార్ల వినియోగం భారీగా పెరిగింది. ఒకప్పుడు ఒక వర్గానికే పరితిమైన కార్లను.. ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కార్ల తయారీ కంపెనీలు సైతం తక్కువ బడ్జెట్‌లో కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. అయితే కొత్త ఏడాది 2024 ప్రారంభమై అనేక కొత్తకొత్త వెహికల్స్‌ను లాంచ్ చేశాయి. ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొన్ని మోడల్స్‌ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.


అందులో ఆల్టో కే10,వ్యాగన్‌ ఆర్, సెలెరియో,ఎస్‌ ప్రెస్సో, స్విఫ్ట్, డిజైర్ వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్ల కొనుగోలు మీద మారుతీ ఆకర్షిణీయమైన డిస్కౌంట్లు ఇస్తుంది. అలానే క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు అందిస్తోంది. ఈ ఆఫర్లు కేవలం ఏప్రిల్ నెలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ కార్లపై ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

Also Read : ఏథర్ రిజ్టా వచ్చేసింది.. ఇది పక్కా ఫ్యామిలీ స్కూటర్!


మారుతి ఆల్టో కే10

దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న కార్లలో మారుతి సుజుకి ఆల్లో కె10 కూడా ఒకటి. ఈ కారు కొనుగోలుపై కంపెనీ కొనుగోలు దారులకు రూ.62 వేల వరకు బెనిఫిట్స్ ఇస్తుంది. ఇందులో భాగంగా మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.57 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.42 వేల వరకు డిస్కౌంట్ ఇస్తుంది. ఈ కారు ధర మార్కెట్‌లో 3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్యలో ఉంది. ఈ కారులో1.0–లీటర్‌ త్రీ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది.

మారుతి ఎస్‌–ప్రెస్సో

మారుతి ఎస్‌–ప్రెస్సో రెనాల్ట్‌ క్విడ్‌ కారుకు పోటీగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. ఎస్‌ – ప్రెస్సో ఆటోమాటిక్‌ వేరియంట్‌పై రూ.61 వేలు, మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.56 వేలు ఇస్తుంది. అలానే సీఎన్‌జీ వేరియంట్‌ కొనుగోలుపై రూ.46 వేల తగ్గింపు ఇస్తుంది. ఎస్‌–ప్రెస్సో ధరలు రూ.4.27 లక్షల నుంచి రూ.6.12 లక్షల మధ్య ఉన్నాయి.

మారుతి సెలెరియో

సెలెరియో కొనుగోలుపై కూడా మారుతి సుజికి భారీ ఆఫర్ ప్రకటించింది. ఇందులోని మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.56 వేలు తగ్గింపు ఇస్తుంది. అలానే ఆటోమాటిక్‌ వెర్షన్‌పై రూ.61 వేలు ప్రైజ్ తగ్గుతుంది. సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.46 వేల వరకు ధర తగ్గుతుంది. దీని ధర రూ. 3.37 లక్షల నుంచి రూ. 7.10 లక్షల మధ్య ఉంది. ఈ కారులో1.0 లీటర్‌ త్రీ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది.

మారుతి వ్యాగన్‌ ఆర్‌

మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆటోమెటిక్ వేరియంట్‌పై రూ. 61 వేలు, మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.56 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.36 వేల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ కారు ధర రూ.5.55 లక్షల నుంచి రూ.7.26 లక్షల మధ్య ఉంది. ఈ కారు 1.0–లీటర్‌ త్రీ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్, 1.2–లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు.

మారుతి స్విఫ్ట్‌

మనందరికీ మారుతి సుజికి అనగానే గుర్తొచ్చేది స్విఫ్ట్. కారు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఈ మోడల్ కామన్‌గా ఉంటుంది. అయితే కంపెనీ ఇప్పుడు ఆటోమాటిక్‌ వేరియంట్‌‌పై రూ. 42 వేల డిస్కౌంట్ ప్రకటించింది. మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.37 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.22 వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. స్విఫ్ట్ ధరలు రూ.5.99 లక్షల నుంచి రూ. 8.89 లక్షల మధ్య ఉంది.

Also Read : ఫోక్స్ వ్యాగాన్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. రూ. లక్షల్లో డిస్కౌంట్లు..!

మారుతి డిజైర్‌

మారుతి డిజైర్‌ కొనుగోలుపై కంపెనీ అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. ఇందులో ఆటోమాటిక్‌ వేరియంట్‌పై రూ. 37 వేలు, మాన్యువల్‌ వేరియంట్‌ పైన రూ.32 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.7 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. డిజైర్‌ ధరలు మార్కెట్‌లో రూ. 6.57 లక్షల నుంచి రూ. 9.39 లక్షల మధ్య ఉన్నాయి.

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×