Investment Plan: ఆదాయం తక్కువ.. వ్యయం ఏటా పెరుగుతూనే ఉంది. దీంతో చాలామంది యువతీ యువకులు ఉద్యోగంలోకి చేరిన నుంచి పొదుపుపై ఫోకస్ చేస్తున్నారు. తాము పెద్దయ్యే సరికి కనీసం 30 నుంచి 50 వేల ప్రతీ నెలా ఆదాయం వచ్చేలా ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు. పెట్టిన మొత్తానికి రిస్క్ లేకుండా సేఫ్ ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మాదిరిగా కాకుండా FDల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హామీతో కూడిన రాబడి వస్తుంది. 50 లక్షల రూపాయలు పొదుపు చేసి ఆదాయం కోసం దానిని FDలో పెట్టాలని భావిస్తున్నారా? మీకు నెలకు ఎంత ఆదాయం లభిస్తుంది? రిస్క్ తక్కువగా ఉండేవారికి ఫిక్స్డ్ డిపాజిట్స్ బెస్ట్ ఆప్షన్. ఎంత వడ్డీ రేటు లభిస్తుందో ముందే మనకి తెలుస్తుండడంతో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు.
చాలా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 6 నుంచి 8 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. మీ వద్ద రూ. 50 లక్షలుంటే ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెడితే ప్రతి నెలా ఎంత ఆదాయం వస్తుంది. పెట్టుబడి పెట్టిన మొత్తం. రూ. 50 లక్షలు కాగా వడ్డీ 7 శాతం వస్తుంది. తొలి సంవత్సరంలో రాబడి రూ. 3,59,295 లక్షలు అన్నమాట. నెలవారీ వడ్డీ రూ. 29,941 అన్నమాట. వడ్డీ రేటు అనేది ఫిక్స్డ్ డిపాజిట్ కాలపరిమితి మీద ఆధారపడి ఉంటుంది.
బ్యాంకు నిబంధనలపై వడ్డీ చెల్లించే విధానం ఆధారపడి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి నెలకు సుమారు రూ. 30 వేలు మీ భవిష్యత్తు అవసరాలకు సరిపోకపోవచ్చు. దానికి ధరల పెరుగుదల ప్రధాన కారణం. 1980 కిలో రెండు రూపాయలుంటే బియ్యం.. ప్రస్తుతం తక్కువలో తక్కువ రూ. 50 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. మరో విషయం ఏంటంటే.. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వచ్చే వడ్డీ ఆదాయానికి.. పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ALSO READ: ప్రతి నెలా ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఎంత వరకూ చేయొచ్చు? డబ్బు ఆదా చేసే సూపర్ ఫార్ములా ఇదే!
ట్యాక్స్ కట్టయిన తర్వాత మీ చేతికి వచ్చే డబ్బులు తగ్గుతాయి. ఈ విషయాన్ని వినియోగదారులు పరిశీలించాలి. రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెట్టేవారు ఫిక్స్డ్ డిపాజిట్స్ పై కాకుండా ట్యాక్స్‌లను పరిగణలోకి తీసుకోని పెట్టుబడులు పెట్టడం మంచిది. ఉద్యోగంలో చేరిన నుంచి కాస్త పొదుపు వైపు ఫోకస్ చేస్తే.. కొన్నాళ్ల కైనా పైన చెప్పిన టార్గెట్ రీచ్ కావడం ఈజీ అవుతుందని బ్యాంకులు నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు ప్రతీ నెలా కట్టేవి కూడా ఉంటాయి. దగ్గరలో బ్యాంకులను సంప్రదిస్తే ఇంకా పొదుపు పథకాలు మీకు తెలుస్తుంది.