2024 Yezdi Adventure Review: దేశీయ మార్కెట్ ఆటోమొబైల్ రంగంలో అదరగొడుతోంది. కొత్త కొత్త వాహనాలు లాంచ్ అయి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో కొత్త వాహనం దేశీయ మార్కెట్‌లోకి వచ్చింది. ప్రముఖ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా యెజ్డీ అడ్వెంచర్ బైక్‌ని విడుదల చేసింది. ఈ కొత్త బైక్‌కి సంబంధించిన ఫుల్ రివ్యూ ఇప్పుడు వచ్చేసింది. ఈ బైక్ ఎలా ఉంది.. దాని పెర్ఫార్మెన్స్ బాగుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి డైవింగ్ అనుభవాన్ని కోరుకునే యువ రైడర్ల కోసం ఈ అడ్వంచర్ బైక్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త యెజ్డీ బైక్ దాని మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ బైక్‌లో రిఫైన్డ్ ఇంజన్, మెరుగైన ఛాసిస్, పూర్తిగా అడ్వెంచర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేలా కంపెనీ అప్డేట్ చేసింది. ఇది క్లాసిక్ లుక్‌తో వస్తుంది. అలాగే ఈ అడ్వంచర్ బైక్ ఇంజిన్ చుట్టూ కొత్త మెటల్ కవర్‌ని అమర్చారు. దీని వల్ల డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే పొడవైన విండ్‌షీల్డ్ కూడా అందించారు.
Also Read: బిఎస్ఏ గోల్డ్ స్టార్ 650 లాంచ్‌కు సిద్ధం.. ఫీచర్లు హైలైట్..!
ఈ బైక్‌లో డెవలప్ చేసిన ఆల్ఫా 2 ఇంజిన్‌ను అమర్చారు. ఈ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పవర్‌హౌస్ బైక్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ లిక్విడ్ కూల్డ్ 334సిసి ఇంజిన్ 30.2 పిఎస్ పవర్, 29.9 ఎన్ ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అడ్వంచర్ బైక్ 220 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ని పొందుతుంది. ఇందులో 15.5 లీటర్ భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అందువల్ల లాంగ్ జర్నీ చేసేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ బైక్‌లో సస్పెన్షన్ సెటప్, ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, బ్యాక్ సైడ్ మోనోషాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ అడ్వంచర్ బైక్ ఎత్తైన కొండలు, రాళ్లు, బురద వంటి కఠినమైన దారుల్లో ప్రయాణాన్ని సులువు చేస్తుంది. ఇలాంటి సమయంలో ఇంజిన్ భాగాలను సేఫ్‌గా ఉంచడానికి కొత్త సంప్ గార్డ్‌ని అందించారు. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ ఆప్టిమైజేషన్‌ను కలిగి ఉంది. కాగా ఈ అడ్వంచర్ బైక్‌లో వైబ్రేషన్‌లు రాకుండా మ్యూట్ చేసే ఫీచర్‌ను అందించడం గమనార్హం. ఇందులో ఆరు స్పీడ్ గేర్‌బాక్స్ అసిస్ట్, స్లిప్ క్లచ్‌ను అందించారు. కాగా ఈ బైక్ రూ.2.09 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో మార్కెట్‌లోకి వచ్చింది. ఇందులో నాలుగు కలర్ వేరియంట్లు ఉన్నాయి. టొర్నడో బ్లాక్ రూ.2.09 లక్షలు, మాగ్నైట్ మెరూన్ డిటీ రూ.2.12 లక్షలు, వోల్ఫ్ గ్రే డిటీ రూ.2.15 లక్షలు, గ్లేసియర్ వైట్ డిటీ రూ.2.19 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ అయింది