BigTV English

Nissan X-Trail SUV: నిశ్శబ్దంగా వస్తున్న నిస్సాన్‌ ఎక్స్-ట్రయల్.. ఆ ఎస్యూవీకి గట్టి పోటీ తప్పదా..!

Nissan X-Trail SUV: నిశ్శబ్దంగా వస్తున్న నిస్సాన్‌ ఎక్స్-ట్రయల్.. ఆ ఎస్యూవీకి గట్టి పోటీ తప్పదా..!

Nissan X-Trail SUV Launching Soon In India: ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్‌లో నిస్సాన్ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి ఇదివరకే లాంచ్ అయిన కార్లు సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను సంపాదించుకున్నాయి. ఎస్యూవీ విభాగంలో ఈ కార్లకు మంచి క్రేజ్ కూడా ఉంది. జపాన్ బ్రాండ్ అయిన ఈ నిస్సాన్ త్వరలో భారతదేశంలో ఒక ఫుల్‌సైజ్ ఎస్యూవీని లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. అదే నిస్సాన్ ఎక్స్ ట్రయల్ ఎస్యూవీ. ఈ 4th జెన్ నిస్సాన్ ఎక్స్ ట్రయల్ ఎస్యూవీ త్వరలో దేశీయ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇది లాంచ్ అయ్యాక ప్రస్తుతం దేశంలో ఆదిపత్యం చెలాయిస్తున్న టయోటా పార్చ్యూనర్‌కి గట్టి పోటీ ఇస్తుందని కొందరు భావిస్తున్నారు.


ఇకపోతే ఈ నిస్సాన్ ఎక్స్ ట్రయల్ ఎస్యూవీ గతంలో అంటే 2022లో ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఇక ఇప్పుడు భారతదేశంలో తన హవా చూపించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ కొత్త ఎస్యూవీ టీజర్‌ను జపనీస్ ఆటో దిగ్గజం రిలీజ్ చేసింది. ఈ టీజర్‌ కొత్త ఎస్యూవీ ఇంటీరియర్స్‌లోని ఫీచర్లను తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ మోడల్ అత్యాధునిక టెక్నాలజీ, కనెక్టివీ సౌకర్యాలు, సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు ఈ టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది.

Also Read: నిస్సాన్ నుంచి కొత్త కారు.. బోలెడన్ని ఫీచర్లు.. లాంచ్‌కి సిద్ధం..!


భారతీయ వినియోగదారుల టేస్ట్‌కు తగ్గట్టుగా జపనీస్ ఆటో మొబైల్ దిగ్గజం నిస్సాన్ ఎక్స్ ట్రయల్ ఎస్యూవీని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇదివరకు ప్రపంచ మార్కెట్‌లో రిలీజ్ అయిన నిస్సాన్ ఎక్స్ ట్రయల్ 5 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే మరి ఇప్పుడు దేశీయ మార్కెట్‌లో నిస్సాన్ ఎక్స్ ట్రయల్ 7 సీటర్ కాన్ఫిగరేషన్ లేదా మధ్యలో బెంచ్ సీట్‌తో వస్తుందని తాజాగా విడుదలైన టీజర్‌లో వెల్లడైంది.

ఈ 4th జెన్ నిస్సాన్ ఎక్స్ ట్రయల్ ఎస్యూవీ 2.7 మీటర్ల కంటే ఎక్కవ వీల్‌బేస్‌తో వస్తుంది. కాగా గ్లోబల్‌లో రిలీజ్ అయిన ఈ కార్ పెట్రోల్ అండ్ హైబ్రిడ్ పవర్‌ట్రైయిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అదే దేశీయ మార్కెట్‌లోకి రానున్న ఈ మోడల్ 1.5 లీటర్, 3 సిలిండర్ టర్బో ఛార్జ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని అంటున్నారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 201 బిహెచ్‌పి పవర్, 305 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది CVT గేర్‌ బాక్స్‌తో వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అలాగే ఇది AWD (ఆల్ వీల్ డ్రైవ్)తో వస్తుందని సమాచారం. త్వరలో ఈ నిస్సాన్ ఎక్స్ ట్రయల్ ఎస్యూవీకి సంబంధించి మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Nissan India (@nissan_india)

Tags

Related News

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Big Stories

×