Trump Towers in Hyderabad: అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన నిర్మాణ కంపెనీ హైదరాబాద్‌లో అడుగు పెట్టబోతోంది. ఇందుకు సంబంధించిన పనులు పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభంలో జూనియర్ ట్రంప్ భారత్ రానున్నారు. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఆరు ప్రాంతాల్లో ట్రంప్ టవర్ల పనులు ప్రారంభంకానున్నాయి.
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ నిర్మాణ సంస్థ భారత్ వైపు ఫోకస్ చేసింది. భారత్‌లో ఇప్పటికే నాలుగు సిటీల్లో ట్రంప్ టవర్లు ఉన్నాయి. వాటిలో ముంబై, కోల్‌కత్తా, గుర్గావ్, పూణె ల్లో ఆ సంస్థ నిర్మించింది. లేటెస్ట్‌గా మరో ఆరు టవర్లు నిర్మించాలని ప్లాన్ చేసింది.
అందుకు సంబంధించిన పనులు తెరవెనుక చకచకా జరిగిపోతున్నాయి. వాటిలో హైదరాబాద్‌తోపాటు బెంగుళూరు, ముంబై, నోయిడా, పూణె, గురుగ్రామ్ నగరాల్లో నిర్మించనుంది. వీటితో భారత్‌లో ట్రంప్ టవర్ల సంఖ్య పదికి చేరుకోనున్నాయి. అమెరికా తర్వాత భారత్‌లోనే అత్యధికంగా ట్రంప్ టవర్లు నిర్మాణం కానున్నాయి.
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్ ఎక్కడ అనేది అసలు ప్రశ్న. మాదాపూర్‌లోని ఖానాపూర్‌లో రెండేళ్ల కిందట ఓ నిర్మాణ సంస్థ దాదాపు మూడు ఎకరాలను కొనుగోలు చేసింది. హెచ్ఎండీఏ వేలంలో దక్కించుకుంది. స్థానిక మంజీరా గ్రూప్‌తో కలిసి ట్రంప్ నిర్మాణ సంస్థ ఈ టవర్ నిర్మించే యోచనలో ఉంది.
ALSO READ: గోల్డ్ కొనుగోలు దారులకు గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
27 అంతస్తుల్లో నిర్మించనున్న ట్రంప్ టవర్‌లో నాలుగు, ఐదు బెడ్ రూమ్‌లతో అపార్ట్మెంట్లను నిర్మించనున్నారు. దాదాపు ఆరువేల చదరపు అడుగులన్నమాట. చదరపు అడుగుకు 13 వేలను ధరగా నిర్ణయించాలన్నది ఆలోచన చేస్తున్నారు. ఆ లెక్కన నాలుగు బెడ్ రూమ్‌ల నిర్మాణానికి ఐదున్నర కోట్లన్నమాట.
మిగతా సిటీల్లో ట్రిబెకా డెవలపర్స్‌తో కలిసి నిర్మించాలని ఆలోచన చేస్తోంది ట్రంప్ నిర్మాణ కంపెనీ. కేవలం అపార్టుమెంట్లే కాకుండా ఆఫీసులు, విల్లాలు, గోల్ఫ్ కోర్సులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో జూనియర్ ట్రంప్ భారత్‌కు రానున్నారు. ట్రంప్ టవర్ల ప్రాజెక్టును లాంచింగ్ చేయనున్నట్లు ట్రిబెకా డెవలపర్స్ ఫౌండర్ కల్పేష్ మెహతా తెలిపాడు. దశాబ్దం కిందట ట్రిబెకా డెవలపర్స్-ట్రంప్ నిర్మాణ సంస్థ కలిసి ఇండియాలో అడుగుపెట్టిన విషయం తెల్సిందే.