Today Gold Rate: పెళ్లిల్లు, పండుగల వంటి సుభకార్యాలు అంటే అందరికి మొదట గుర్తొచ్చేది గోల్డ్.. అలాంటి సుభకార్యాలు ఎక్కువగా కార్తీకమాసంలో జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గడంతో గోల్డ్ షాపులకు కొనుగోలు దారులు బారులు తీరారు. రెండు రోజుల్లో రెండు వేల వరకు తగ్గింది. ట్రంప్ పాలసీలపై స్పష్టత వచ్చేంత వరకు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కాస్త తగ్గిన కొన్ని నెలల తర్వాత మళ్లీ గోల్డ్ రేట్స్ పెరగవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72, 860 ఉంది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 79,480 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే..
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,480 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72, 860 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,630 ఉంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.73,010 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,480 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72, 860 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,480 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72, 860 వద్ద కొనసాగుతోంది.
Also Read: గోల్డ్ కొనేవారికి మరో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్, తెలంగాణలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,480 ఉండగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72, 860 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,480 ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72, 860 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,480 ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72, 860 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వెండి ధరలు..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. చెన్నై, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధరలు రూ.1,03,100 వద్ద కొనసాగుతోంది.
కోల్ కత్తా, బెంగుళూరు, ఢిల్లీలో కిలో వెండి ధరలు రూ.94,100 ఉంది.