 
					Financial Changes: నవంబర్ 1, 2025 నుంచి ఆధార్ నుంచి జీఎస్టీ స్లాబులు, బ్యాంకు నామినీలు ఇలా కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. రోజు వారీ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపించే కొన్ని నిబంధనలు మారనున్నాయి.
యూఐడీఏఐ పిల్లల ఆధార్ కార్డుల బయోమెట్రిక్ అప్డేట్ కు తీసుకుని రూ. 125 రుసుమును మాఫీ చేసింది. ఒక సంవత్సరం పాటు పిల్లలకు బయోమెట్రిక్ ఉచితంగా చేయనున్నారు. పేరు, పుట్టిన తేదీ, చిరునామా లేదా మొబైల్ నంబర్ అప్డేట్ కోసం రూ. 75, వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్‌ల బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ. 125 ఫీజు తీసుకోనున్నారు. ఆధార్ అడ్రస్, పుట్టిన తేదీ లేదా పేరును ఆన్‌లైన్‌లో సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.
నవంబర్ 1 నుంచి బ్యాంకులు అకౌంట్, లాకర్ లేదా సేఫ్ కస్టడీ వస్తువులకు నలుగురి వరకు నామినీలను అనుమతిస్తారు. అత్యవసర సమయాల్లో కుటుంబ సభ్యులు ఈ నిధులను సులభంగా పొందేందుకు ఈ కొత్త నియమాలు ఉపయోగపడనున్నాయి. నామినీలను యాడ్ చేయడం లేదా మార్చడం అనే ప్రక్రియను సులభతరం చేయనున్నారు.
నవంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులకు ప్రత్యేక రేటుతో కొత్త జీఎస్టీ స్లాబ్ లను అమలుచేయనుంది. గతంలో 5%, 12%, 18%, 28% నాలుగు స్లాబ్ వ్యవస్థ స్థానంలో 5, 18 శాతాలను భర్తీ చేయనుంది. 12%, 28% స్లాబ్‌లు తొలగించింది. అయితే లగ్జరీ, సిన్ వస్తువులకు 40 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) నుంచి యూపీఎస్ కి మారాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 30 వరకు సమయం ఇచ్చింది.
పదవీ విరమణ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్ చివరి నాటికి వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దీనిని బ్యాంక్ శాఖలో లేదా జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఈ గడువులో సమయానికి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉంది.
Also Read: Lenskart IPO: లెన్స్‌కార్ట్ ఐపీఓ.. తొలి రోజు వివరాలు.. నిపుణులు ఏమంటున్నారు?
నవంబర్ 1 నుంచి ఎస్బీఐ కార్డు వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా జరిపే విద్య సంబంధిత చెల్లింపులపై 1% రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐ కార్డు ఉపయోగించి డిజిటల్ వాలెట్‌లోకి రూ.1,000 కంటే ఎక్కువ అమౌంట్ పంపిస్తే 1% రుసుమును చెల్లించాలి.