BigTV English

Abhishek Bachchan: అభిషేక్ అకౌంట్లోకి ప్రతి నెల రూ.18 లక్షలు వేస్తున్న SBI, కారణం ఏంటో తెలుసా?

Abhishek Bachchan: అభిషేక్ అకౌంట్లోకి ప్రతి నెల రూ.18 లక్షలు వేస్తున్న SBI, కారణం ఏంటో తెలుసా?

Abhishek Bachchan Gets 1800000 Per Month From SBI: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో ఆయా రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. పలు రకాల వ్యాపారాలు చేయడంతో పాటు స్పోర్ట్స్ టీమ్స్ కు యజమానిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ తో కలిసి ముంబైలోని పలు ప్రైమ్ ఏరియాల్లో అపార్ట్ మెంట్లను కొనుగోలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం SBI ప్రతి నెల తన అకౌంట్లోకి రూ. 18 లక్షలు జమ చేస్తుందని చెప్పారు. బ్యాంకులు నెల నెల డబ్బులు తీసుకోవడం విన్నాం. కానీ, అభిషేక్ బచ్చన్ కు నెల నెలకు డబ్బులు ఇవ్వడం ఏంటని చాలా మంది ఆలోచిస్తున్నారు.


ఇంతకీ SBI ఆయనకు ఎందుకు డబ్బులు ఇస్తుందంటే?    

అభిషేక్ బచ్చన్ కు ముంబైలోని జుహులో విలాసవంతమైన అపార్ట్ మెంట్ ఉంది. దానిని ఆయన రూ. 280 కోట్లతో కొనుగోలు చేశారు. ఈ అపార్ట్ మెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ ను ఆయన SBIకి లీజుకు ఇచ్చారు. బ్యాంకుతో 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం SBI నెలకు 18.9 లక్షల రూపాయల రెంట్ చెల్లిస్తుంది. ఈ డబ్బును ప్రతి నెల అభిషేక్ అకౌంట్లో జమ చేస్తుంది. రీసెంట్ గా SBIతో అభిషేక్ బచ్చన్ లీజుకు సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో అద్దె పెంపుకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం నెలకు రెంట్ రూ. 18.9 లక్షలు కాగా, 5 సంవత్సరాల తర్వాత  రూ. 23.6 లక్షలకు పెరగనుంది. పదేళ్లకు రూ. 29.5 లక్షలకు చేరుకోనుంది. నివేదికల ప్రకారం ఆయన SBIకి 3,150 చదరపు అడుగుల ప్లేస్ ను రెంట్ కు ఇచ్చారు.


అభిషేక్ బచ్చన్ గురించి..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అభిషేక్ బచ్చన్. ‘గురు’, ‘ధూమ్’, ‘బంటీ ఔర్ బబ్లీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు వ్యాపారరంగంలోనూ రాణిస్తున్నాడు. పలు స్పోర్ట్స్ టీమ్స్ లో వాటాలను కలిగి ఉన్నారు. అభిషేక్ వ్యక్తిగత విషయానికి వస్తే 2007లో ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఆరాధ్య బచ్చన్ అనే కూతురు ఉంది. గత కొద్ది కాలంగా ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై అటు ఐశ్వర్య గానీ, ఇటు అభిషేక్ గానీ స్పందించలేదు. ఈ మధ్య పలు ఈవెంట్లకు ఐశ్వర్య తన కూతురుతో కలిసి ఒంటరిగా పాల్గొంటున్నది. అభిషేక్ తో పాటు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే వారి విడాకుల ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఐశ్వర్యతో పాటు అభిషేక్ కూడా ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు.

Read Also: రైలు మిస్సైతే టికెట్ వేస్ట్ అయినట్లేనా? అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయ్?

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×