Big Stories

Adani Port acquired Gopalpur Port: అదానీ చేతికి మరో పోర్టు… ఎక్కడ..? ఎవరిది..?

Adani acquires in Gopalpur Port from Shapoorji Pallonji Group
Adani acquires in Gopalpur Port from Shapoorji Pallonji Group

Adani acquired Gopalpur Port: అరేబియా సముద్రం వైపు తన వ్యాపార కార్యకలాపాలను పెంచుకున్న అదానీ గ్రూప్.. తూర్పు వైపు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఒడిషా వైపు ఫోకస్ పెట్టింది. అక్కడ గోపాల్‌‌‌‌‌‌‌‌పూర్ పోర్టు మేజర్ వాటాని సొంతం చేసుకుంది. ఈ పోర్టును షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది.

- Advertisement -

గోపాల్‌పూర్ డీప్ వాటర్ పోర్టును అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు అమ్మినట్టు మంగళవారం వెల్లడించింది పల్లోంజీ గ్రూప్. ముఖ్యంగా 56 శాతాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీని విలువ అక్షరాలా 3 వేల 350 కోట్ల రూపాయలు. గోపాల్‌పూర్ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఐరన్ ఓర్, కోల్, లైమ్ స్టోన్, అల్యూమినియం ఎగుమతి చేస్తోంది.

- Advertisement -

గ్రీన్ ఫీల్డ్ ఎల్‌ఎన్‌జీ రీ గ్యాసిఫికేషన్ టెర్నినల్ ఏర్పాటుకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీతో ఒప్పందం కుదుర్చుకుంది. గోపాల్‌పూర్‌ పోర్టులో మేజర్ బాగాన్ని విక్రయించింది. ఒడిషాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని పల్లోంజీ గ్రూప్ 2017లో కొనుగోలు చేసింది. కొన్నినెలలుగా పోర్టుల నుంచి పల్లోంజీ గ్రూప్ పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది.

గతంలో మహారాష్ట్రలోని థరమ్‌తర్ పోర్టును 710 కోట్లకు జేఎస్ డబ్ల్యూ ఇన్‌ఫ్రాకు విక్రయించింది. దీన్ని 2015లో కొనుగోలు చేసినప్పుడు దాని సామర్థ్యం ఓ మిలియన్ కాగా తర్వాత ఐదు టన్నులకు పెంచింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌పై 20 వేల కోట్ల రుణభారం ఉంటుందన్నది ఓ అంచనా. దీన్ని తగ్గించుకునే క్రమంలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెబుతోంది పల్లోంజీ గ్రూప్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News