Bigg Boss 9 Telugu Day 15:సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ లో నామినేషన్స్ ఉంటాయి. ఆడియన్స్ అందరిలో ఆసక్తిని పెంచే ఘట్టం ఇదే. అందరు బిగ బాస్ ఊహించని ట్విస్ట్ పెట్టాడు. నిన్న సండే ఫన్ డే ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కెప్టెన్సీ టాస్క్ లో రీతూ చౌదరి ఫెవరిటిజం చూపించిందని వీడియోతో సహా బయటపెట్టారు. సన్ ఫండే ఎపిసోడ్ తర్వాత సోమవారం నామినేషన్ ఎపిసోడ్ ఎలా సాగిందో ఇక్కడో లుక్కేయండి.
అసలు గుట్టు బయటపడటంతో రీతూ చౌదరి ఎమోనల్ డ్రామా మొదలుపెట్టింది. నేను ఫెవరిటిజం చూపించానని అందరూ ఆవైయిడ్ చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. దీంతో సోల్జర్ పవన్ రీతూని.. చిన్నపిల్లలా ఓదార్చాడు. ఆ తర్వాత తనూజ కూడా రీతూని ఓదారుస్తూ కన్సోల్ చేసింది. హోస్ట్ నాగార్జున ఆదేశం మేరకు.. ఫ్లోరా షైనీని జైలుకు వెళ్లింది. అయితే బిగ్ బాస్ ఫ్లోరాకి ఎక్సప్షన్ ఇచ్చారు. తదుపరి ఆదేశం మేరకు ఫ్లోరాని మెయిన్ హౌజ్ కి తీసుకువెళ్లమన్నాడు.
ఆ తర్వాత అసలు ఘట్టం మొదలైంది. హౌజ్ ఓనర్స్(సెలబ్రిటీలు)ని తగిన కారణాలు చేప్పి నామినేట్ చేయాలని టెనెంట్స్(కామనర్స్)కి సూచించాడు. దీంతో మాస్క్ మ్యాన్ హరీష్ తగిన కారణాలు చెబుతూ సంజనని నామినేట్ చేశాడు. ఈ సందర్బంగా గుడ్డు దొంగ, ఓనర్ అయ్యాక ఆమెలో దెయ్యం బయటపడిందని, ఆడవాళ్లు గాజులు వేసుకున్నారా? అంటూ నేషనల్ టెలివిజనల్ అనుచిత కామెంట్స్ చేసిందంటూ ఆమెను నామినేట్ చేశాడు. ఇక ప్రియ కూడా ఆమెకు అహం అంటూ రీజన్ చెప్పిది.
శ్రీజ కూడా హరీష్ పాయింట్ నే చూపించి సంజనకే ఓటేసింది. డిమోన్ కూడా సంజననే నామినేట్ చేయడం టెనెంట్స్ అంత ఏకగ్రీవంగా సంజనను ఫస్ట్ నామినేట్ చేశారు. అదేవిధంగా సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ కూడా నామినేట్ చేశారు. ఇక రీతూ చౌదరిని ఫెవరిటిజం చూపించిందని నామినేట్ చేశారు. ప్రతివ్రత శిరోమణులు అని రీతూ చేసిన కామెంట్ నచ్చలేదని కారణంతో శ్రీజ దమ్ము ఆమెను నామినేట్ చేసింది. అలాగే రీతూ ఫుటేజ్ కోసమే ఫీలింగ్స్ చూపిస్తుంది. నేను అలిగితే ప్యాంపర్ చేయాలంటూ ఆమె మ్యానిఫెస్ట్ చేస్తుంది. అలా టెనెంట్స్ లో ఆప్షన్ లో భరణి, రాము రాథోడ్, రీతూ ఉండగా.. మెజారిటీ రీతూకే రావడంతో ఆమెను నామినేట్ చేశారు.
అలా సెలబ్రిటీల నుంచి సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి, రీతూ చౌదరిని నామినేట్ చేశారు. ఇక టెనెంట్స్ నామినేషన్ వచ్చేసరికి కామనర్స్ మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటి వరకు ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకున్న వారి మధ్య పెద్ద వారే జరిగింది. టెనెంట్స్ అంత కలిసి హరీష్ బిహెవియర్ తీరు కరెక్ట్ గా లేదని ఆయనను నామినేట్ చేశారు. ఈ క్రమంలో తాను ఎలా ఉన్న రియాలిటీగ ఆడానని, ఫెవరిటిజం, చాక్లెట్స్ ఇస్తూ ల*త్కో*ర్ పనులు చేయలేదంటూ నోరుజారాడు. ఆయన కామెంట్స్ కి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అన్నం తినకుండ ఉండటం కరెక్ట్ కాదనే కారణం కూడా చూపించారు.
గతవారం ఆయన తినకుండ, ఆటపై ద్రష్టి పెట్టకుండ.. పర్సనల్ ఎటాక్ చేశారంటూ వివిధ కారణాలతో హరీష్ ని నామినేట్ చేశారు. ఆ తర్వాత ఓనర్స్ కి టెనెంట్స్ నామినేషన్స్ మార్చే అధికారం ఇచ్చాడు బిగ్ బాస్. మొత్తం ఐదు నామినేషన్స్ తో పాటు రెండు కొత్త నామినేషన్స్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. అదే విధంగా.. టెనెంట్స్ చేసిన నామినేషన్ లో రెండింటిని స్వాప్ చేసే అధికారం ఇచ్చాడు. కానీ, చివరిగా మాత్రం ముగ్గురు టెనెంట్స్ నామినేషన్ లో తప్పసనిసరిగా ఉండాలని కండిషన్ పెట్టాడు. ఇక ఓనర్స్ అంత చర్చించుకుని నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాడు. ఓనర్స్ అంతా ఏకాభిప్రాయంతో టెనెంట్స్ నామినేషన్స్ నుంచి సంజన, సుమన్ శెట్టిలను నామినేషన్ నుంచి తీశారు.
ఆ తర్వాత టెనెంట్స్ నుంచి సోల్జర్ పవన్ కళ్యాణ్, ప్రియలను నామినేట్ చేశారు. ఆ తర్వాత ఓనర్స్ నుంచి రాము రాథోడ్ ని భరణి నామినేట్ చేశాడు. అలాగే టెనెంట్స్ నుంచి సంజన శ్రీజ దుమ్ముని నామినేట్ చేసింది. అలాగే భరణి, సుమన్ శెట్టిలు కూడా ఆమెనే నామినేట్ చేశారు. ఫైనల్ గా ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లేవారిలో సోల్జర్ పవన్ కళ్యాణ్, హారిక హరిష్, ప్రియ, శ్రీజ దమ్ము, రీతూ చౌదరి, రాము రాథోడ్, ఫ్లోరా షైనీలు నామినేట్ అయ్యారు. చివరిలో బిగ్ బాస్.. కెప్టెన్ డిమోన్ పవన్ కి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చారు. నామినేట్ అయిన సభ్యుల నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వగా.. డిమోన్, శ్రీజ దుమ్ముని సేవ్ చేశాడు. దీంతో రీతూ షాకైంది. తనని సేవ్ చేస్తాడని ఆశపడ్డ రీతూ పవన్ ట్విస్ట్ ఇచ్చాడు. పవన్ శ్రీజని సేవ్ చేయడంతో రీతూ ఎమోషనల్ అయ్యింది.