BSNL recharge offer: బీఎస్ఎన్ఎల్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ప్రసిద్ధ టెలికం సంస్థ. దేశవ్యాప్తంగా విస్తరించిన ఫైబర్ మరియు బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఇంటర్నెట్, ఫోన్లు, డిజిటల్ టెలివిజన్ సేవలను అందిస్తుంది. వినియోగదారులకు నాణ్యతతో పాటు, కొత్త సాంకేతికతలను అందిస్తూ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కూడా కొత్త మార్గాలను చూపుతోంది.
ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కొత్త డిజిటల్ టెలివిజన్, ఆన్‌లైన్ సేవను ప్రారంభించింది. దీన్ని ఐఎఫ్టివి లేదా బిఐటివి అని పిలుస్తారు. ఈ సేవ ద్వారా వినియోగదారులు ఒక్క సబ్‌స్క్రిప్షన్‌లో 1000కి పైగా చానెల్స్, ఎచ్‌డీ మరియు ఎస్‌డీ చానెల్స్, అలాగే సినిమాలు, సిరీస్‌లను చూడవచ్చు.
సాధారణంగా టెలివిజన్ చూడటానికి నెలకు 200 నుంచి 300 రూపాయలు ఖర్చవుతాయి. ఆన్‌లైన్ ద్వారా సినిమా, సిరీస్‌లు, షోస్, వీడియో కంటెంట్ సేవలు తీసుకుంటే ఖర్చు ఇంకా పెరుగుతుంది. హెచ్‌డి చానెల్స్ చేర్చినట్లయితే ఖర్చు 600 నుంచి 1000 రూపాయల వరకు చేరుతుంది. కానీ ఈ కొత్త ప్లాన్ ద్వారా, వినియోగదారులు కేవలం 61 రూపాయలతో ఈ అన్ని సౌకర్యాలను పొందవచ్చు. అది ఎలా అంటే..
ఐఎఫ్టివిలో 500కి పైగా ప్రత్యక్ష ప్రసార చానెల్స్ ఉన్నాయి. వీటిలో హిందీ, ఇంగ్లీష్ కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి అనేక ప్రాంతీయ భాషల చానెల్స్ కూడా ఉన్నాయి. అంటే, ప్రతి ఇంటికి కావాల్సిన జాతీయ, ప్రాంతీయ చానెల్స్ అన్నీ ఒక్క సబ్‌స్క్రిప్షన్‌లో చూడవచ్చు.
Also Read: Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!
ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు సినిమా, సిరీస్‌లు కూడా చూడగలుగుతారు. కాబట్టి, ఎక్కువ ఖర్చు లేకుండా, ఒక్క ప్లాన్‌తో ఎక్కువ కంటెంట్ ఆస్వాదించవచ్చు.
ఇప్పుడు, ఈ సేవను ఇంట్లోనే చేసుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ తెలిపిన వివరాల ప్రకారం, 18004444 నంబరుకు వాట్పాప్ మెసేజ్ పంపాలి. మొదట ‘హాయ్’ అని టైప్ చేసి పంపితే ఒక మెనూ రూపంలో ప్లాన్ ను పంపిస్తుంది. ఆ మెనులో ఐఎఫ్టివి ప్రారంభించండి అనే ఆప్షన్ ఉంటుంది. దానికి క్లిక్ చేసి ఎంచుకోవడం ద్వారా సేవ యాక్టివ్ అవుతుంది.
ఐఎఫ్టివి ఉపయోగించడానికి, ఇంట్లో బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ (FTTH) కనెక్షన్ ఉండాలి. కేవలం ఈ కనెక్షన్‌లోనే ఈ సేవలు పని చేస్తాయని గమనించాలి. అలాగే, ఇంటర్నెట్ ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి, తద్వారా వేగవంతమైన కనెక్షన్‌తో నిరంతరాయంగా ప్రసారం అనుభవించవచ్చు. ఐఎఫ్టివి చూడటానికి, స్మార్ట్ టెలివిజన్, ఆండ్రాయిడ్ టెలివిజన్ లేదా ఫైర్ టీవీ స్టిక్ అవసరం ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్ లో అపరిమితంగా చానెల్స్, సినిమాలు, సిరీస్‌లు అందించడం నిజంగా ఆశ్చర్యకరం!