సాధారణంగా తమ దగ్గర డబ్బులను చాలా మంది ఫిక్స్ డ్ డిపాజిట్(FD) చేయిస్తుంటారు. తమ డబ్బుకు వడ్డీ పొందేందుకు డిపాజిటర్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. అయితే, చాలా మంది FD చేసే సమయంలో పలు పొరపాట్లు చేస్తుంటారు. దీని వలన చాలా మొత్తంలో వడ్డీ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంతకీ అవేంటి? ఎలా వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
FD చేసే వారిలో ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఇదే. చాలా బ్యాంకుల్లో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు FD టెన్యూర్ పీరియడ్ ఉంటుంది. నచ్చిన సమయాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రీమెచ్చూర్ కంటే ముందే FDని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే, ఆ సమయానికి ఉన్న వడ్డీలో ఒకశాతం పెనాల్టీ కింద కట్ చేసి మిగతా వడ్డీ ఇస్తారు. ఈ పద్దతిలో తక్కువ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. అందుకే గోల్ బేస్ చేసుకుని FD టైమ్ ని ఫిక్స్ చేసుకోవాలి.
చాలా మంది ఒకే FDలో రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అలా చేయకూడదు. అంతేకాదు, మొత్తం ఒకే బ్యాంకులో ఇన్వెస్ట్ చేయకూడదు. అలా చేస్తే ఒకవేళ బ్యాంక్ దివాలా తీస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే, కొద్ది కొద్ది మొత్తాన్ని రెండు మూడు బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ ఏదైనా బ్యాంకు దివాళా తీస్తే, DICGC ద్వారా ఆర్బీఐ సబ్సిడీ అందిస్తుంది. అదీ రూ. 5 లక్షల లోపు వరకు అందిస్తుంది. నష్టపోయే అవకాశం ఉండదు. ఎక్కువ మొత్తం ఒకే బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది.
Read Also: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?
చాలా మంది ఇంటి దగ్గర్లో ఉన్న బ్యాంకులు లేదంటే సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకులో FD చేస్తుంటారు. అంతేగానీ, తమకు అనుకూలంగా ఉన్న టెన్యూర్ కు ఎందుకు ఎక్కువ వడ్డీ ఉంటుంది? అని సెర్చ్ చేసి తెలుసుకోవాలి. ఇందుకోసం స్టేబుల్ మనీ అనే యాప్ లో ఆయా బ్యాంకుల వడ్డీ రేటును కంపార్ చేసుకుని ఇన్వెస్ట్ చేసి, మంచి వడ్డీ పొందవచ్చు. సో, ఇకపై మీరు కూడా డబ్బును FDలో ఇవ్వెస్ట్ చేయాలంటే ఈ మూడు విషయాలను అస్సలు మర్చపోకండి.
Read Also: EPFO కీలక నిర్ణయం, ఒకే క్లిక్ తో పీఎఫ్ సెటిల్మెంట్!