WhatsApp: మనందరం ప్రతిరోజూ ఎక్కువగా వాడే యాప్ అంటే వాట్సాప్. కానీ చాలా సార్లు మన దగ్గర రెండు సిమ్ కార్డులు ఉంటాయి. ఒకటి పర్సనల్ కోసం, ఇంకోటి ఆఫీస్ వర్క్ కోసం. ఈ రెండు నంబర్లను ఒకే ఫోన్లో వాడాలనిపిస్తుంది. కానీ వాట్సాప్ లో ఒకేసారి ఒక అకౌంట్ మాత్రమే వాడగలమని చాలామంది అనుకుంటారు. నిజానికి ఇప్పుడు కొత్త ఫీచర్ వల్ల ఒకే యాప్‌లో రెండు అకౌంట్లు కూడా వాడుకోవచ్చు.
దీనికోసం ప్రత్యేకంగా వేరే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే వాట్సాప్‌లోనే రెండో ఖాతా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా రెండు సిమ్‌లు ఫోన్‌లో ఉండాలి. ఎందుకంటే వాట్సాప్‌కి ప్రతి ఖాతా ఒక ప్రత్యేక నంబర్ తప్పనిసరిగా కావాలి. ఆ తరువాత మీరు ఫోన్‌లో ఉన్న వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. పై భాగంలో కుడివైపున కనిపించే మూడు చుక్కల గుర్తుపై నొక్కాలి. అక్కడి నుండి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. మీ పేరుతో కనిపించే ప్రొఫైల్ పక్కన ఒక ప్లస్ గుర్తు ఉంటుంది. దానిపై నొక్కితే కొత్త అకౌంట్ యాడ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది.
ఇక్కడ మీరు రెండో సిమ్ నంబర్ ఇవ్వాలి. ఆ నంబర్‌కి వచ్చే ఓటిపి ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేస్తే కొత్త ఖాతా సెట్ అవుతుంది. ఇలా ఒకే యాప్‌లోనే రెండు అకౌంట్లు వాడుకోవచ్చు. ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు మారాలంటే మళ్లీ ప్రొఫైల్ పక్కన కనిపించే ఆప్షన్‌లో మీరు జోడించిన రెండో అకౌంట్‌ను ఎంచుకోవాలి. వెంటనే ఆ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇలా లాగౌట్ అయ్యే అవసరం లేకుండా రెండింటినీ ప్యారలల్‌గా వాడుకోవచ్చు.
Also Read: Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
ఇది ఉపయోగపడే సందర్భాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి, ఒక నంబర్‌తో మీరు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చాట్ చేయొచ్చు. మరొక నంబర్‌తో ఆఫీస్ గ్రూపులు, ఆఫీషియల్ మెసేజ్‌లు హ్యాండిల్ చేయొచ్చు. ఇలా చేస్తే మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేరుగా క్లియర్‌గా మేనేజ్ చేసుకోవచ్చు.
ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ ట్రిక్ ఉంది. పర్సనల్ అకౌంట్‌కి ఒక ఫొటో, ఆఫీస్ అకౌంట్‌కి వేరే ఫొటో సెట్ చేసుకోండి. అలాగే ప్రతి ఖాతాకి వేరే రింగ్టోన్ లేదా నోటిఫికేషన్ సౌండ్ పెట్టుకుంటే ఏ మెసేజ్ ఎక్కడికి వచ్చిందో వెంటనే తెలుస్తుంది.
ఈ ఫీచర్ చాలా సేఫ్. ఎందుకంటే రెండో అకౌంట్ యాడ్ చేసినా కూడా మీ మొదటి అకౌంట్‌లో ఉన్న చాట్స్, మీడియా ఫైళ్ళు, స్టేటస్ అన్నీ అలాగే ఉంటాయి. వాటిలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. రెండో అకౌంట్ కూడా అదే విధంగా పూర్తి ఫీచర్స్‌తో పనిచేస్తుంది. కాల్స్ చేయొచ్చు, స్టేటస్ పెట్టొచ్చు, ఫోటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు.
ఇంత సులభంగా లాగౌట్ కాకుండానే ఒకే ఫోన్లో రెండు వాట్సాప్ అకౌంట్లను వాడుకోవచ్చు. ఇది ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీ టైమ్ కూడా సేవ్ అవుతుంది, సిమ్ స్విచ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇబ్బంది ఏమీ ఉండదు.