air conditioner offers: వేసవి కాలం వచ్చేసింది. దీంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సమయంలో మీ ఇంట్లో చల్లదనంతోపాటు కంఫర్టుగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో మీ ఇంటిని చల్లగా మార్చేందుకు ఏసీ కోసం వెతుకుతున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే బడ్జెట్ ధరల్లో మంచి బ్రాండెడ్ ఏసీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం. ప్రముఖ డైకిన్ కంపెనీ తన కొత్త 2024 మోడల్ 0.8 టన్ 3 స్టార్ స్ప్లిట్ ACపై అద్భుతమైన ఆపర్ ప్రకటించింది. ఇది కేవలం 20 వేల ధరల్లోనే లభించడం విశేషం. దీంతో ఈ ఏసీ తక్కువ ధరలో మంచి పనితీరును అందించనుంది.
డైకిన్ బ్రాండ్ విశ్వసనీయత
డైకిన్ బ్రాండ్ అంటే విశ్వాసం, నాణ్యత, అధిక పనితీరు. గత కొన్ని దశాబ్దాలుగా డైకిన్ కంపెనీ ఎయిర్ కండిషనింగ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. డైకిన్ AC లు టెక్నాలజీ పరంగా అత్యుత్తమమైనవి. ఇవి ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలను తీర్చే విధంగా అప్‌డేట్ అవుతుంటాయి. డైకిన్ AC లు ఎనర్జీ ఎఫిషియెన్సీతోపాటు శబ్దం లేని కంఫర్ట్, అధిక డ్యూరబిలిటీ వంటి లక్షణాలతో మార్కెట్లో ప్రాధాన్యతను అందుకున్నాయి. ఇప్పుడు 2024 మోడల్ AC మరింత స్మార్ట్, మరింత కంఫర్టబుల్‌గా పనిచేస్తుంది.
కెపాసిటీ:
ఈ ACలో 0.8 టన్నుల కెపాసిటీ ఉంది. ఇది చిన్న గదులకు (100 – 120 చదరపు అడుగులు) బెస్ట్ ఆప్షన్. చిన్న గదులను వేగంగా చల్లగా మార్చడం కోసం ఇది బాగా పనిచేస్తుంది.
Read Also: Broadband Offer: తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్.. ఈ ఓటీటీలు
స్టార్ రేటింగ్:
ఈ ACకి 3 స్టార్ రేటింగ్ ఉంది. అంటే, ఇది తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తూ అధిక శక్తిని అందిస్తుంది. ఇది ఎలక్ట్రిసిటీ బిల్లును తగ్గించుకునే ఉద్దేశంతో డిజైన్ చేయబడింది.
కాపర్ కండెన్సర్:
ఈ మోడల్‌లో కాపర్ కండెన్సర్ ఉపయోగించారు. వేగంగా చల్లదనం, తక్కువ నిర్వహణ ఖర్చు, ఎక్కువకాలం నిలకడగా పని చేస్తుంది. దీంతోపాటు తుప్పు రాకుండా పనిచేస్తుంది.
Coanda Airflow టెక్నాలజీ:
డైకిన్ ACలో ఉన్న Coanda Airflow టెక్నాలజీ గదిలోని ప్రతీ మూలలో సమానమైన గాలి ప్రవాహాన్ని అందిస్తుంది. గదిలో ఎక్కడ ఉన్నా, గాలి సాఫ్ట్‌గా, నెమ్మదిగా ప్రవహించడంలో సహాయపడుతుంది.
Econo మోడ్:
Econo మోడ్ టెక్నాలజీ AC విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. మీరు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు కూడా AC ఎక్కువ విద్యుత్ వినియోగించకుండా, అదనపు భారాన్ని తగ్గిస్తుంది.
శబ్దం లేకుండా పనిచేయడం
డైకిన్ AC అత్యంత నిశ్శబ్దంగా పని చేస్తుంది. 21 dB కంటే తక్కువ శబ్దం మాత్రమే అందిస్తుంది. అంటే, రాత్రిపూట కూడా ఎలాంటి సమస్య లేకుండా చక్కగా నిద్రపోవచ్చు.
వివిధ మోడ్‌లు:
సగటు నెలవారీ విద్యుత్ ఖర్చు:
ఆఫర్ ద్వారా..
దీని అసలు ధర రూ. 38,100 ఉండగా, 29 శాతం తగ్గింపు ధరతో రూ. 26,990కే ఫ్లిప్ కార్టులో లభిస్తుంది. అంతేకాదు మీ వద్ద ఏదైనా పాత ఏసీ ఉంటే, ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా దాదాపు రూ.6500 వరకు తగ్గింపు ఇస్తున్నారు. అంటే రూ. 26 వేలు ఉన్న ఏసీ మీకు రూ. 20 వేలకే వచ్చే ఛాన్సుంది.