Kayadu Lohar: హీరోయిన్స్ విషయంలో యూత్‌కు ఎప్పటికప్పుడు క్రష్ అనేవారు మారుతూనే ఉంటారు. ఒక సినిమా హిట్ అయితే అందులో హీరోయిన్‌ను వెంటనే క్రష్ లిస్ట్‌లోకి యాడ్ చేసేస్తారు కుర్రకారు. ఇక ఆ హీరోయిన్ కాస్త అందంగా ఉండి, మంచి పర్ఫార్మెన్స్ చేస్తే తనకు అభిమానులుగా మారిపోతారు. ప్రస్తుతం కాయదు లోహర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్రాగన్’ మూవీలో హీరోయిన్‌గా నటించింది కాయదు. అంతకు ముందు హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించినా కూడా ‘డ్రాగన్’ వల్ల తనకు భారీగా పాపులారిటీ లభించింది. అలా యూత్‌కు లేటెస్ట్ క్రష్‌గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విటర్‌లో అడుగుపెట్టింది.
ట్విటర్‌లో అడుగు
సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం ఇష్టం ఉన్నా లేకపోయినా కచ్చితంగా యాక్టివ్‌గా ఉండాల్సిందే. అలా లేకపోతే వారిని ప్రేక్షకులు మర్చిపోతారనే భయం వారిలో ఉంటుంది. అందుకే చాలావరకు ప్రతీ సినీ సెలబ్రిటీకి ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ లాంటివి ఉంటాయి. కాయదు లోహర్‌కు కూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. కానీ ‘డ్రాగన్’ ముందు వరకు తను ఇన్‌స్టాగ్రామ్‌లో అంత యాక్టివ్‌గా ఉండేది కాదు. ఈ సినిమా విడుదలయిన తర్వాత మెల్లగా దీనిని ప్రమోట్ చేయడం కోసం ఇన్‌స్టాలో యాక్టివ్ అయ్యింది కాయదు. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే సరిపోదని ట్విటర్‌లో కూడా అడుగుపెట్టింది ఈ యంగ్ బ్యూటీ.
అఫీషియల్ అకౌంట్
‘డ్రాగన్’ చూసిన తర్వాత కాయదు లోహర్ (Kayadu Lohar)కు ఫ్యాన్స్ అయిన యూత్ అంతా తనను మళ్లీ ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలోనే తను ట్విటర్‌లో అడుగుపెడుతున్నట్టుగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే కాయదు పేరు మీద ఎన్నో ఫేక్ ట్విటర్ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి. అయితే అవేవి తనవి కాదని మొదటి పోస్ట్‌తోనే క్లారిటీ ఇచ్చేసింది. ‘నేను నా పేరుతో చాలా ట్విటర్ పేజెస్ చూస్తున్నాను. అవన్నీ చూస్తుంటే మీకు కూడా చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంటుందని తెలుసు. కానీ ఇదొక్కటే నా అఫీషియల్ ట్విటర్ అకౌంట్. నాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇందులోనే షేర్ చేస్తాను’ అని చెప్పుకొచ్చింది కాయదు లోహర్.
Also Read: నిక్కర్ వేసుకొని వెళ్తే కమిట్మెంట్ అడగరా.. అన్నపూర్ణమ్మ బోల్డ్ కామెంట్స్
ఫుల్ బిజీ
ఇప్పటికే ‘డ్రాగన్’ మూవీ హిట్ అవ్వడంతో కాయదు లోహర్ ఒక రేంజ్‌లో సంతోషంలో ఉంది. ఇక ఈ మూవీని ప్రేక్షకులు మర్చిపోక ముందే ‘ఇదయం మురళి’ అనే మరో తమిళ మూవీతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఇది మాత్రమే కాదు.. మరోసారి తెలుగు ప్రేక్షకులను కూడా నేరుగా పలకరించడానికి సిద్ధమయ్యింది. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ‘ఫంకీ’లో కాయదు హీరోయిన్‌గా ఎంపికయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రవితేజ సరసన నటించడానికి కూడా కాయదు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మొత్తానికి ఈ ముద్దుగుమ్మకు మంచి రోజలు వచ్చాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Hey everyone! I’ve seen so many pages out there, and I know it might be confusing but this is my one and only official X (Twitter) page! I’ll be sharing everything with you right here, so stay tuned for all the love, updates, and special moments. Grateful to have you all with me!…
— Kayadu Lohar (@11Lohar) March 12, 2025