Broadband Offer: భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ టెలికాం సంస్థ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తోంది. దేశంలో 4G, 5G సేవలతో పాటు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించడంలో కూడా BSNL పురోగతి సాధించింది. ఈ క్రమంలోనే తాజాగా OTT ప్రియుల కోసం సంస్థ ఫైబర్ అల్ట్రా OTT న్యూ ప్లాన్ పేరుతో ఓ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్, ఉచిత ల్యాండ్‌లైన్ సహా అనేక OTT సబ్‌స్క్రిప్షన్లు ఉన్నాయి.
పూర్తిగా కవరేజీ + ఎంటర్‌టైన్‌మెంట్
BSNL నుంచి తాజా ప్రీమియం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలకు రూ. 1799 మాత్రమే. ఇది వినియోగదారులకు 300 Mbps వేగాన్ని అందిస్తుంది. దీంతోపాటు ఈ ప్లాన్ ద్వారా 6500 GB డేటా వరకు పొందవచ్చు. అయితే ఈ పరిమితిని మించి ఉపయోగిస్తే స్పీడ్ 20 Mbpsకి తగ్గుతుంది.
ఆఫర్ ప్రత్యేకతలు
OTT లిస్టు
ఈ ప్లాన్‌కు ఫైబర్ అల్ట్రా OTT న్యూ ప్లాన్ అని BSNL నామకరణం చేసింది. ఇది కేవలం ఇంటర్నెట్ ప్లాన్ మాత్రమే కాదు. వినియోగదారులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీలను అందిస్తుంది.
Read Also: Samsung 5G Phone: హోలీ ఫెస్టివల్ ఆఫర్.. రూ.6 వేలకే
OTTలతో అదనపు ప్రయోజనాలు
ఈ ప్లాన్‌తో వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్ మాత్రమే కాకుండా, OTT కంటెంట్ ను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా స్ట్రీమింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా JioCinema, Hotstar వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, క్రీడా ఈవెంట్లు చూసేందుకు ఇది బెస్ట్ ఆప్షన్.
BSNL 4G & 5G సేవల విస్తరణ
ఇటీవల BSNL తన 4G సేవలను 75,000+ ప్రాంతాల్లో విస్తరించిందని ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు BSNL 4G సేవలను తక్కువ ఖర్చుతో వినియోగించుకోవచ్చు.
కస్టమర్ లాస్
టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ కారణంగా, BSNL గత కొన్ని నెలల్లో తన కస్టమర్ బేస్ కోల్పోయింది. TRAI నివేదిక ప్రకారం, డిసెంబర్ 2024 నాటికి BSNL దాదాపు 3.22 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. అయితే, కొత్తగా ప్రారంభించిన OTT ప్లాన్‌లు వినియోగదారులను తిరిగి ఆకర్షించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.