Flight Ticket: ప్రయాణం మన జీవితంలో తప్పనిసరి అయిపోయింది. ఎవరినైనా కలవడానికి, పనిమీద ప్రయాణం చేయడానికి, లేదా విహార యాత్ర కోసం అయినా.. విమాన ప్రయాణం తప్పనిసరిగా అవుతుంది. అయితే విమాన టికెట్ ధరలు పెరుగుతున్న కొద్దీ ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆ టికెట్‌పై డిస్కౌంట్ దొరికితే మనకెంత ఉపయోగం కదా! అలాంటి ప్రత్యేక ఆఫర్‌ను ఇప్పుడు ఎయిర్ ఇండియా అందిస్తోంది.
తక్కువ పాయింట్స్‌తో టికెట్లు బుక్
ఎయిర్ ఇండియా తాజాగా ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. ప్రయాణికులకు వచ్చిన అవార్డ్ పాయింట్లపై 25 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. సాధారణంగా మనం ప్రయాణం చేసినప్పుడు వచ్చిన పాయింట్స్‌తో టికెట్ బుక్ చేయాలంటే ఎక్కువ పాయింట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఆఫర్ ద్వారా తక్కువ పాయింట్ల తోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా సుభవార్త చెప్పింది. ఉదాహరణకు మీరు నలభై వేల పాయింట్లతో బుక్ చేసే టికెట్‌ను ఇప్పుడు ముప్పై వేల పాయింట్లతోనే పొందవచ్చు అని ప్రకటించింది. ఈ తగ్గింపు ప్రయాణికులకు సౌకర్య వంతంగా మారింది..
ఆఫర్ ఎప్పటి వరకు?
ఈ ఆఫర్‌ను మొదట కొద్ది రోజులు మాత్రమే కొనసాగిస్తామని ఎయిర్ ఇండియా తెలిపిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు దాన్ని మరికొన్ని వారాలు పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలిపింది. అంటే ప్రయాణికులకు ఇంకా నెల మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో ఎవరైనా తమ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకున్నా, లేకపోతే ఉద్యోగ పనుల కోసం విమానంలో ప్రయాణించాలనుకున్నా తక్కువ పాయింట్లతోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఎయిర్ ఇండియా స్టార్ అలయన్స్‌లో భాగమై ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్ లైన్స్‌తో అనుబంధం కలిగి ఉంది. దీనివల్ల ప్రయాణం మధ్యలో ఆటంకాలు తలెత్తవు. అంతర్జాతీయంగా కూడా ఎక్క డికైనా వెళ్లాలన్నా ఈ తగ్గింపు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. ఒకవైపు డాలర్ విలువ పెరిగి విదేశీ ప్రయాణాలు ఖరీదైనవిగా మారుతున్న వేళ, ఈ తగ్గింపు చాలా మందికి నిజమైన ఆదా అందిస్తుంది.
టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?
ఈ ఆఫర్ పొందడం కూడా చాలా సులభం. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోకి లేదా యాప్ లోకి వెళ్లి అవార్డ్ ఫ్లైట్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు కావాల్సిన తేదీ, గమ్య స్థానం ఎంచుకుంటే తగ్గింపు ఆటోమేటిక్‌గా అమలులోకి వచ్చేస్తుంది. చాలా సులభమైన ప్రక్రియతో తక్కువ పాయింట్స్‌తో టికెట్లు మీ పేరుపై బుక్ అవుతాయి.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఉందండోయ్!
ఈ ఆఫర్ లో కొన్ని షరతులు ఉంటాయి. అన్ని రూట్స్ పై, అన్ని తేదీల్లో ఇది వర్తించక పోవచ్చు. కొన్ని ప్రత్యేక మార్గాల్లో మాత్రమే ఈ తగ్గింపు లభించవచ్చు. కాబట్టి ప్రయాణికులు ముందుగా వెబ్‌సైట్ లోని వివరాలను చెక్ చేసుకోవడం మంచిది. ఎయిర్ ఇండియా ఇచ్చిన ఈ కొత్త ఆఫర్ ప్రయాణికులకు ఒక బంగారు అవకాశం. తక్కువ మైల్స్‌తో ఎక్కువ ప్రయాణం చేసే అవకాశం కలిగే ఈ సమయాన్ని ఎవరూ వదులుకోవద్దు. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ తగ్గింపు ఉండనుంది కాబట్టి త్వరగా ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోవడం మంచిది. ఇంకెందుకు ఆలస్యం డోంట్ మిస్ ఎయిర్ ఇండియా ఆఫర్.