Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ఎదురుచూస్తున్నవారికి భారీ గుడ్ న్యూస్. ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ డేట్‌ను అమెజాన్ అధికారంగా ప్రకటించింది. అలాగే, ఈ సేల్‌లో ఉండబోయే ప్రత్యేక ఆఫర్స్ గురించి కూడా వివరించింది. త్వరలో రానున్న దసరా, దీపావళి పండుగలకు సంబంధించిన ఈ సేల్‌లో ప్రతి ఒక్కరికి ఈ ఆఫర్స్ లభించనున్నాయి.
సేల్ ఎప్పటి నుండి ప్రారంభం
అమెజాన్ గ్రేట్ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. మరి ఎలా చేసుకోవాలని అనే ప్రశ్నకు అమెజాన్ క్లారిటీ కూడా ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా 24 గంటల ముందే యాక్సెస్ లభించే విధంగా ప్రక్రియను అమలు చేయనుంది. వారికి మాత్రమే 24గంటల ముందు యాక్సెస్ అభించే అవకావం అంటూ శుభవార్త చెప్పింది. దీంతో అమెజాన్ యాక్సెస్ కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సౌకర్యంతో సెప్టెంబర్ 22 నుండి ప్రైమ్ మెంబర్స్ ఈ సేల్‌లో ముందుగానే షాపింగ్ చేసుకునే అవకాశం లభించనుంది. ఎస్‌బీఐ బ్యాంక్ ఈ సేల్‌లో ప్రత్యేక సేల్ పార్టనర్‌గా ఉంది. ఎస్‌బీఐ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్స్ అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందే అవకాశం ఇచ్చింది. దీంతో ఈ సేల్‌ను మరింత ఆకర్షణీయంగా మారనుంది, ఎందుకంటే పండుగ సీజన్‌లో పెద్ద మొత్తంలో షాపింగ్ చేసే వారు ఎస్‌బీఐ కార్డ్స్ ఉపయోగిస్తే డబ్బు కచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు.
కిచెన్, అవుట్ డోర్స్ ఐటెమ్స్ పై 80 శాతం డిస్కౌంట్
ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్స్, కిచెన్, అవుట్ డోర్స్, ఎలక్ట్రానిక్స్, అదనపు వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనున్నాయి. కొత్త మోడల్స్, ప్రీమియం బ్రాండ్స్ అన్నీ సేల్‌లో ఉంటాయి. కిచెన్, అవుట్ డోర్స్ ఐటెమ్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్, ఎలక్ట్రానిక్స్, అదనపు వస్తువులపై గరిష్టంగా 80 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్ల పై 65 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్ అందుతుంది.
Also Read: Meenakshi Chaudhary : టాలీవుడ్ కి మీనా గుడ్ బై.. బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్..
మరింత ఆసక్తికరంగా షాపింగ్ అనుభవం
స్మార్ట్ ఫోన్ల కోసం ప్రత్యేక టీజర్ పేజీని ఇప్పటికే అమెజాన్ ప్రారంభించింది. ఈ పేజీలో శ్యామ్ సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్, వన్‌ప్లస్ 13ఎస్, ఐక్యూ13 వంటి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ పై ఉత్తమ ఆఫర్లు పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది. ఈ ఫోన్స్‌కి ప్రత్యేక ఆఫర్స్, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ చేంజ్ ఆఫర్స్ అన్నీ కలిపి షాపింగ్ అనుభవాన్ని మరింత ఆసక్తికరంగా చేయనున్నాయి.
వారిమాత్రం 24 గంటల ముందే యాక్సెస్
ఈ సేల్‌ను మరింత విశేషంగా మార్చే అంశం ఏమిటంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు 24 గంటల ముందే యాక్సెస్ ఉండడం. దీని వల్ల ప్రతి ఒక్కరు మొదటి రోజు నుంచే హాట్ డీల్స్ పొందే అవకాశం కలుగనుంది. పండుగ సీజన్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఉత్పత్తులు వేగంగా అవసరాలు పూర్తి కావడానికి ముందు, ప్రైమ్ మెంబర్స్ మొదటగా షాపింగ్ చేయగలరు.
ముఖ్యంగా ఈ సేల్‌లో ప్రతి ఒక్కరు పండుగ సీజన్‌లో అవసరమైన షాపింగ్ పూర్తి చేసుకోవడానికి ఈ సేల్ ను ఉపయోగించవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రతి సేల్ వంటి, ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ సేల్ ద్వారా కస్టమర్స్ కి పెద్ద డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్స్, ప్రైమ్ మెంబర్స్‌కి ముందుగా యాక్సెస్, బ్యాంక్ రాయితీలు, హాట్ డీల్స్ వంటి అన్ని అవకాశాలను అందిస్తోంది. ప్రతి ఒక్కరు కావలసిన ఉత్పత్తులపై పెద్ద డిస్కౌంట్ పొందడానికి ఈ సేల్ ను వినియోగించుకోవచ్చు.