Brahmamudi Kanakam : స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్లలో ఒకటి బ్రహ్మముడి. ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. అందులో ఈమధ్య ఈ సీరియల్ స్టోరీ మళ్లీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో నటించిన యాక్టర్స్ అందరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళే అని తెలిసిందే. వారిలో ఆడియన్స్ ను తన కామెడితో కట్టిపడేసిన కనకం ఒకటి. సీరియల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నా కనకం రియల్ లైఫ్ గురించి చాలామంది తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే ఈమె గురించి చాలామందికి తెలియదు. ఈ సీరియల్లో నటించకు ముందు ఒకప్పుడు ఈమె బెస్ట్ కొరియోగ్రాఫర్ అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈమె ఏ సినిమాలకు కొరియోగ్రఫీ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..
బ్రహ్మముడి అభిమానుల్లో ఎంతగానో ఆకట్టుకున్న క్యారెక్టర్లలో ఒకటి కనకం. ఈ పాత్రలో నటించిన ఆమె పేరు నీప శివ.. బేసిక్‌గా నీప మంచి క్లాసికల్ డ్యాన్సర్. అంతేకాదు ఈవెంట్ ఆర్గనైజర్‌గా కూడా చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా తమిళ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం తెలుగులో సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. సీరియల్స్ కన్నా ముందు ఏమో క్లాసికల్ డాన్సర్ అని తెలుసుకున్న ఆమె అభిమానులు సంతోష పడుతున్నారు..
Also Read: మైత్రి మూవీ మేకర్స్ కు దిమ్మతిరిగే షాక్.. 5 కోట్లు డిమాండ్..
బుల్లితెర ప్రముఖ ఛానెల్ స్టార్ మా టీవీ బ్రహ్మముడి సీరియల్‌లోని ఒక ముఖ్యమైన పాత్ర కనకం, ఈ పాత్రలో నీప శివ అనే నటి పోషిస్తుంది. కనకం మధ్యతరగతి తల్లిగా, తన ముగ్గురు కూతుళ్లకు గొప్ప సంబంధాలు చేయాలని కలలు కంటుంది. ఆమె పాత్రలో ఎమోషన్, కామెడీతో పాటు అనేక డ్రామాలు ఉంటాయి. కావ్యకు జీవిత భాగస్వామిని, అల్లుడిని కనుగొనడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. అందులో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గొప్పింటికి కూతుర్లను పంపించాలని కలగన్న ఆమెకి ఒకే కుటుంబానికి తన ముగ్గురు కూతుర్ని పంపిస్తుంది.. ఈ సీరియల్లో అందరికన్నా ఈ పాత్ర ఎక్కువ స్కోపు ఉందని తెలుస్తుంది. ఈ సీరియల్ కు గాను ఈమె ఒక్క రోజుకి 15 వేల రెండింటిని తీసుకుంటుందని తెలుస్తుంది.. ఈ సీరియల్ నెలలో దాదాపు 20 రోజులకు పైగా షూటింగ్ ఉంటుంది. ఈ లెక్కన ఈమె నెలకు లక్షల సంపాదిస్తుంది. ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు తమిళ్లో కూడా వాళ్ళు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. సీరియల్స్ మాత్రమే కాదు అటు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఈవెంట్లలో సందడి చేస్తుంది.. ఈమె తమిళంలో మాత్రమే కాదు.. ప్రస్తుతం మరో భాషలో కూడా సీరియల్స్ చేయబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా తెలుగు బుల్లితెరపై ఇంత పాపులారిటీ సంపాదించడం మామూలు విషయం కాదు.. తెలుగులో ప్రస్తుతం బ్రహ్మముడితో పాటుగా నిండు మనసులు సీరియల్ లో నటిస్తుంది..