ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రియులంతా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 17 మార్కెట్లోకి విడుదల అయ్యింది. మొత్తం నాలుగు కొత్త యాపిల్ ఐఫోన్ 17 మోడల్ ఫోన్‌లను అమెరికాలోని క్యుపర్టినోలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేసింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐఫోన్ 17 మోడల్ ఫోన్లతో పాటు, యాపిల్ వాచ్, యాపిల్ ఎయిర్ పాడ్స్ వంటి ఉత్పత్తులను విడుదల చేశారు.
ఇందులో స్టాండర్డ్ మోడల్ ఐఫోన్ 17 గురించి మాట్లాడితే.. ఈ ఫోన్ బ్లాక్, వైట్, లావెండర్‌తో సహా 5 రంగుల్లో వస్తోంది.అలాగే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇందులో ప్రత్యేకతగా చెప్పవచ్చు. స్క్రీన్ కోసం సిరామిక్ షీల్డ్ 2 ఉపయోగించారు. ఐఫోన్ 17 A19 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అత్యంత శక్తివంతమైన బేస్ మోడల్ అని చెప్పవచ్చు.
ఐఫోన్ 17 ఫీచర్లు ఇవే..
ఐఫోన్ 17 ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో వస్తోంది. ఇందులో 48MP ప్రధాన లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఉంది. సెకండరీ కెమెరా కూడా 48MP తో వస్తోంది. ఈసారి కంపెనీ కెమెరాలో AI ఫీచర్‌లను కూడా సపోర్ట్ చేసింది. ఇక డిస్ ప్లే విషయానికి వస్తే 6.3-అంగుళాల డిస్ ప్లే దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఫోన్ 256GB బేస్ వేరియంట్‌తో అందుబాటులో ఉంది. దీనికి యాక్షన్ బటన్ ఉంది.
iPhone 17 : ధర రూ. 82,900
ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ ఫీచర్లు ఇవే..
యాపిల్ కంపెనీ ఈ సారి ప్లస్ మోడల్ బదులుగా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ విడుదల చేసింది. ఇప్పటివరకు బ్రాండ్‌లో ఇది అత్యంత స్లిమ్ ఫోన్ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 5.6mm మందం మాత్రమే ఉంది. ఇందులో, ముందు, వెనుక వైపులా సిరామిక్ షీల్డ్‌ను పొందుతారు. హ్యాండ్‌సెట్ నాలుగు కలన్స్ లో లభిస్తుంది. A19 ప్రో ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ 48MP సింగిల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ రెండు కెమెరాల సెటప్ తో వస్తోంది. ఐఫోన్ 17 ఎయిర్‌లో eSIM ఎంపిక మాత్రమే ఉంటుంది. అంటే, మీరు ఫిజికల్ సిమ్‌ను ఉపయోగించలేరు. అడాప్టివ్ పవర్ మోడ్ దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఫీచర్ కారణంగా, మీరు ఒక సారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించగలరు.
iPhone 17 Air : ధర రూ. 99,990
ఐఫోన్ 17 ప్రో ఫీచర్లు ఇవే..
కంపెనీ కొత్త డిజైన్‌తో ఐఫోన్ 17 ప్రోను విడుదల చేసింది. కంపెనీ తాజా ప్రో మోడల్‌లో అల్యూమినియంను ఉపయోగించారు. ఇందులో శక్తివంతమైన బ్యాటరీ అందించారు. ఈ మోడల్ A19 ప్రో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మునుపటి వెర్షన్ కంటే 40 శాతం మెరుగైన పనితీరును అందిస్తుంది. మీరు స్మార్ట్‌ఫోన్ ద్వారా చక్కటి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు.
iPhone 17 Pro ధర: రూ. 1,24,900
ఐఫోన్ 17 ప్రో మాక్స్
ఐఫోన్ 17 ప్రో ఫీచర్స్ విషయానికి వస్తు ట్రిపుల్-కెమెరా సెటప్, ఆధునిక థర్మల్ మేనేజ్‌మెంట్ (వాపర్-చేంబర్), అధిక బ్యాటరీ లైఫ్, ProMax పెద్ద డిస్‌ప్లే 6.9-inch ఇందుల్ో ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ప్రో, ప్రో మాక్స్ రెండింటిలోనూ 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 2 టీబీ వేరియంట్ కూడా విడుదల చేశారు. దీని ధర రూ. 2,29,900గా ఉంది.
iPhone 17 Pro Max ధర: రూ. 1,59,900