Big Stories

Best Automatic SUVs : ఆటోమేటిక్ ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. తక్కువ ధరలో బెస్ట్ ఇవే!

Best Automatic SUVs : దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ వాహనాల హవా నడుస్తుంది. ఎస్‌యూవీ కార్లకు వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. కంపెనీలు కూడా పోటాపోటీగా ఈ సెగ్మెంట్‌లో వెహికల్స్ లాంచ్ చేస్తున్నాయి. అయితే మీరు కూడా ఆటోమేటిక్ ఎస్‌యూవీ వెహికల్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. తక్కువ బడ్జెట్‌లో ఐదు ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఇవి ఆటోమెటిక్ ఎస్‌యూవీలు. వాటి ధర, ఫీచర్లు, ఏ మోడళ్లు ఉన్నాయి. తదితర విషయాల గురించి తెలుసుకోండి.

- Advertisement -

హ్యుందాయ్ ఎక్స్‌టర్
హ్యుందాయ్ తన సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీ ఎక్సెటర్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్షన్‌తో అందిస్తుంది. కంపెనీ ఈ ఎస్‌యూవీని ఆరు వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికతో విక్రయిస్తుంది.  AMT వేరియంట్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.23 ​​లక్షల నుండి ప్రారంభమవుతుంది. AMT టాప్ వేరియంట్‌ను రూ. 10.28 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

- Advertisement -
Best Automatic SUVs
Best Automatic SUVs

నిస్సాన్ మాగ్నైట్
జపనీస్ కార్ తయారీదారు నిస్సాన్ దేశంలో మాగ్నైట్ ఎస్‌యూవీని రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు అందిస్తోంది. ఈ ఎస్‌యూవీలో ఆటోమెటిక్ వేరియంట్ కూడా ఉంది.. నిస్సాన్ మాగ్నైట్ ఆటోమెటిక్వే రియంట్‌ను రూ. 6.60 లక్షల నుండి రూ. 8.74 లక్షల మధ్య కొనుగోలు చేయవచ్చు. ఈ ఎస్‌యూవీలో కంపెనీ మొత్తం ఐదు వేరియంట్లు ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌ కలిగి ఉన్నాయి.

Also Read :  9 సీట్లతో మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ లాంచ్!

రెనాల్ట్ కిగర్
రెనాల్ట్ తక్కువ ధర ఎస్‌యూవీ కిగర్‌ని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లాంచ్ చేసింది. ఈ ఆప్షన్ ఆరు వేరియంట్లలో కూడా ఇవ్వబడింది. రెనాల్ట్ కిగర్ ఆటోమేటిక్ ధర రూ. 7.10 లక్షల నుండి రూ. 9.53 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది.

మారుతీ ఫ్రాంక్స్
Fronxను మారుతి ఎస్‌యూవీగా అందిస్తోంది. కంపెనీ ఈ ఎస్‌యూవీని మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంచింది. దీని AGS వేరియంట్‌లు డెల్టా, డెల్టా ప్లస్‌లలో అందించబడతాయి. దీని ధర రూ. 8.87 లక్షలు నుంచి రూ. 9.27 లక్షలు మధ్యలో ఉంది.

Also Read : ట్రయంఫ్ టైగర్ నుంచి రూ. 16 లక్షల బైక్.. ఒక్కసారి ఎక్కితే ఉంటది మామ!

టాటా పంచ్
టాటా ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పంచ్ ఎస్‌యూవీ తీసుకొచ్చింది. ఇది ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఎక్కువగా సేల్ అవుతున్న వెహికల్. దీని AMT వేరియంట్‌ను రూ. 7.60 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News