BigTV English

Mansoor Ali Khan: బ్రేకింగ్.. నటుడు మన్సూర్ ఆలీఖాన్ కు ఛాతీనొప్పి.. పరిస్థితి విషమం

Mansoor Ali Khan: బ్రేకింగ్.. నటుడు మన్సూర్ ఆలీఖాన్ కు ఛాతీనొప్పి.. పరిస్థితి విషమం

Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన ఛాతీనొప్పి కారణంగా హాస్పిటల్ లో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మన్సూర్ ఆలీఖాన్ పార్లమెంట్ అభ్యర్థిగా పొడిచేస్తున్నాడు. ఇది ఆయన రెండోసారి నిలబడడం.. గత ఎన్నికల్లో ప్రజలు మన్సూర్ ను ఓడించారు. కానీ, ఈసారి గెలవడానికి మన్సూర్ చాలా కష్టపడుతున్నాడు.


మొదట ఇండియా జననాయక పులిగళ్ పార్టీలో ఉంటూ ఎవరి అనుమతి లేకుండా మరొక పార్టీతో పొత్తుకు పాల్పడడంతో ఇండియా జననాయక పులిగళ్ పార్టీ అతనిని పాటి నుంచి తొలగించింది. ఇక ఇప్పుడు మన్సూర్.. స్వతంత్ర అభ్యర్థిగా వేలూరు నుంచి పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రచారం కోసం తమిళనాడులో తిరుగుతున్నాడు. ఇక నేటి ఉదయం ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉంటె సడెన్ గా ఛాతీనొప్పి వచ్చి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు ఆయన హెల్త్ గురించి ఎలాంటి సమాచారం అందలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.


ఇక మన్సూర్.. తెలుగులో కూడా విలన్ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. లియో సినిమాలో త్రిషను రేప్ చేసే సీన్ మిస్ అయ్యాను అని చెప్పి వివాదంలో ఇరుక్కున్నాడు. త్రిష వివాదం వలన మన్సూర్ కు మరింత పేరు వచ్చింది. ఆ తరువాత అతనిపై కేసులు, కోర్టుకు వెళ్లడం జరిగింది. ఇక మన్సూర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Big Stories

×