Aviation New Milestone: దేశీయంగా విమానాల్లో ప్రయాణంచే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కరోజులో విమానాల్లో ప్రయాణించినవారి సంఖ్య తొలిసారి 5 లక్షల మార్క్‌ని తాకింది. దేశీయ విమాన రంగంలో ఇది సరికొత్త మైలురాయి.
విమానంలో ప్రయాణిస్తే గొప్పగా చెప్పుకునేవారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు సామాన్యుడు ప్రయాణించేలా ధరలు అందుబాటులోకి వచ్చారు. క్రమంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఈ ఏడాది నవంబర్ 17న దేశీయ విమానయాన రంగం ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. 3,173 విమాన సర్వీసుల్లో ఒకే రోజులో 5, 05, 412 మంది దేశీయ ప్రయాణీకులు ట్రావెల్ చేసినట్టు విమానయాన శాఖ వెల్లడించింది. దేశీయంగా ఇదొక రికార్డుగా చెబుతున్నాయి విమానయాన శాఖ వర్గాలు.
పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణ డిమాండ్‌ను ఏర్పడిందని విమాన సంస్థలు భావిస్తున్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆదివారం 90శాతం ఆక్యుపెన్సీతో విమానాలు నడిచాయన్న మాట. ఉడాన్ లాంటి పథకాలతో ఇది సాధ్యమైందన్నది ఆ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు.
ALSO READ: షాకింగ్.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
అక్టోబరు 27 నుంచి వచ్చే ఏడాది మార్చి చివరి వరకు దేశంలోని 124 ఎయిర్ పోర్టుల నుంచి వారానికి 25 వేల సర్వీసులు నడుస్తున్నాయి. ఈ లెక్కన విమాన సర్వీసులు సామాన్యులకు మరింత అందుబాటులోకి వచ్చాయనేది అక్కడ క్లియర్‌గా అర్థమవు తోంది.
కరెక్టుగా ఎనిమిదేళ్ల కిందట కేంద్రం ఉడాన్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. దేశీయం గా ప్రయాణికుల సంఖ్య పెంచడానికి ఉద్దేశించిన పథకం అన్నమాట. దీనికితోడు ప్రస్తుతం ఓ వైపు పండుగలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసొచ్చింది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు దేశమంతా దాదాపు 35 లక్షల మ్యారేజ్‌లు జరుగుతాయన్న ది పలు సంస్థల ఓ అంచనా.
ఢిల్లీ, ముంబై, శ్రీనగర్, జైపూర్, గోవా వంటి ప్రధాన నగరాలకు విమాన బుకింగ్‌లు ఉన్నాయి. టైర్ -2 సిటీల్లో ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ నడుస్తోందని కొన్ని ట్రావెల్ కంపెనీలు చెబుతున్నాయి. టైర్-2 సిటీల నుంచి రద్దీ పెరిగితే దేశీయ విమాన రంగం కొత్త రికార్డు నెలకొల్పడం ఖాయమని అంటున్నాయి.