మియాపూర్ లో 17 ఏళ్ల మైనర్ బాలిక కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. పది రోజుల క్రితం మిస్సైన బాలిక కేసు విషాదాంతమైంది. తుక్కుగూడలోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమ వద్ద బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఉప్పుగూడకు చెందిన విఘ్నేశ్ అలియాస్ చింటూ అనే యువకుడు బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. బాలికను మాయమాటలు చెప్పి ఇంటి నుండి తీసుకువెళ్లిన యువకుడు శారీరకంగా లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలిక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా హత్య చేసినట్టు తెలుస్తోంది.
Also read: చిరంజీవికి బాలకృష్ణకి ఉన్న తేడా అదే
బాలికతో నింధితుడికి ఇన్ స్టాగ్రామ్ లో ఐదు నెలల క్రితం పరిచయం ఏర్పడినట్టు సమాచారం. వీరిద్దరూ ఐదు నెలల క్రితం ఫలక్ నుమాలోని ఓ ఆలయం వద్ద మొదటిసారి కలుసుకున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో విఘ్నేశ్ ప్రపోజ్ చేయగా బాలిక అంగీకరించింది. ఆ తరవాత తరచూ చాటింగ్ చేసుకున్న వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం బాలికను ఇంటి నుండి తీసుకువెళ్లిన విఘ్నేశ్ తన స్నేహితుడు సాకేత్, కల్యాణిలకు పరిచయం చేశాడు. అనంతరం సాకేత్, కల్యాణి తో పాటూ విఘ్నేశ్, బాలిక కలిసి నివసించారు. పది రోజుల పాటూ బాలిక విఘ్నేశ్ తో సహజీవనం చేసింది.
ఆమె తల్లి దండ్రులు కూడా టచ్ లోనే ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలో బాలిక ఇతరులతో చాటింగ్ చేస్తుందని విఘ్నేశ్ అనుమానపడటం మొదలు పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలై తారా స్థాయికి చేరాయి. బాలిక పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో విఘ్నేశ్ హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ స్నేహితులు కల్యాణీ, సాకేత్ పెళ్లి చేసుకుని హత్య చేయాలని, అలా చేస్తే అనుమానం రాదని సలహా ఇచ్చారు. వారి సూచన మేరకు విఘ్నేశ్ పెళ్లి చేసుకుని హత్య చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు నటించాడు. బాలిక కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేయగా వారు పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నింధితుడితో పాటూ అతడికి సహకరించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.