E-Paper
Advertisement

Bengaluru Crime: ఛీ.. ఛీ.. ఇదేం కూతురు.. ఏకంగా తల్లి ఫోటోలు ప్రియుడికి పంపి, ఆ తర్వాత

Bengaluru Crime: ఛీ.. ఛీ.. ఇదేం కూతురు.. ఏకంగా తల్లి ఫోటోలు ప్రియుడికి పంపి, ఆ తర్వాత
Advertisement

Bengaluru Crime: టెక్నాలజీ పుణ్యమాని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జన్మనిచ్చిన తల్లి అన్న మమకారం మరిచింది కూతురు. తన ప్రియుడు చెప్పినట్టు ఫాలో అయ్యింది. తాను చేస్తున్నది తప్పు అన్న విషయం తెలుసుకోలేక పోయింది. చివరకు తల్లి ప్రైవేటు ఫోటోలను తన ప్రియుడితో షేర్ చేసుకున్న ఘటన ఆలస్యంగా బెంగుళూరులో వెలుగుచూసింది. అసలేం జరిగింది?

బెంగుళూరులో షాకింగ్ విషయం బట్టబయలు

Advertisement

బెంగుళూరు సిటీలోని మైసూర్ రోడ్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 23 ఏళ్ల కూతురు ఉంది. చదువుతోపాటు ఉద్యోగ అవసరానికి ఫోన్ కావాలని తండ్రిని కోరింది. కూతురు కోరిక కాదనలేని తండ్రి, స్మార్ట్‌ఫోన్ కొనిచ్చాడు. ఆ ఫోన్‌తో తల్లి నిద్రిస్తున్న సమయంలో ప్రైవేట్ భాగాలను ఫోటోలు తీయడం మొదలుపెట్టింది.

ఆ తర్వాత స్నానం చేస్తున్నప్పుడు మూడో కంటికి తెలియకుడా వీడియోలు తీయడం చేసింది. తీసిన ఫోటోలు, వీడియోలను తన ప్రియుడికి పంపడం మొదలుపెట్టింది. కూతురు గదిలోకి పని నిమిత్తం వెళ్లింది తల్లి. ఆ సమయంలో ఓ వ్యక్తితో వీడియో కాల్‌ మాట్లాడడం గమనించింది. తల్లిని చూడగానే కూతురు ఆ కాల్ కట్ చేయడంతో తల్లి అనుమానం వ్యక్తం చేసింది.

Advertisement

తల్లి ప్రైవేటు ఫోటోలు ప్రియుడికి పంపిన కూతురు

దీంతో కూతురు పని నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు ఫోన్‌ని చెక్ చేసింది. ఆ ఫోటోలు చూసి కన్నతల్లి షాకైంది. కూతుర్ని ఏ మాత్రం మందలించకుండా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి. ఈ తతంగం ఫిబ్రవరి 5న జరిగింది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. తొలుత కూతుర్ని పిలిచి విచారణ మొదలుపెట్టారు. ఆమె ఫోన్ తీసుకుని ప్రశ్నలు రైజ్ చేశారు.

దీంతో అసలు విషయం బయటపెట్టింది. తన ప్రియుడు వరుణ్ ఒత్తిడి మేరకు ఈ పని చేసినట్టు యువతి తెలిపింది. తల్లి, పెద్దమ్మకు సంబంధించిన ప్రైవేటు ఫోటోలు, వీడియోలను తీసి వాట్సాప్ లో బాయ్ ఫ్రెండ్‌కు పంపినట్లు తెలిపింది. యువతితోపాటు ఆమె ప్రియుడి ఫోన్లను సీజ్ చేశారు పోలీసులు.

ALSO READ: లంబోర్ఘిని కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిన యువకుడు, వ్యాపారి కొడుకుపై కేసు

ఇదిలావుండగా తల్లి ఫిర్యాదు చేసిన కొన్నిరోజులకు ఆ యువతి ఇంటి నుండి పారిపోయింది. కోరుకున్న ప్రియుడ్ని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. యువతి, ఆమె ప్రియుడి ఫోన్‌లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపినట్టు తెలిపారు పోలీసులు. ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదికలు అందిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని సీనియర్ అధికారులు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×