BigTV English

2024 Bajaj Pulsar N160: USD ఫోర్క్‌తో 2024 బజాజ్ పల్సర్ N160 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఇవే..!

2024 Bajaj Pulsar N160: USD ఫోర్క్‌తో 2024 బజాజ్ పల్సర్ N160 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఇవే..!

2024 Bajaj Pulsar N160: యూత్‌‌లో అదిరిపోయే క్రేజ్‌ను అందుకున్న ది బెస్ట్ బైక్ ఏదన్నా ఉందంటే అది పల్సర్ మాత్రమే. ఈ బైక్ తన లుక్, డిజైన్‌తో యూత్‌ఫుల్ బైక్‌గా గుర్తింపు పొందింది. ఈ బైక్‌కు అమ్మాయిలు కూడా ఫిదా అయ్యారంటే దీని రేంజ్ అలాంటిది మరి. అలాంటి ఈ బైక్ ఇప్పుడు మరో కొత్త వేరియంట్‌లో తాజాగా అందుబాటులోకి వచ్చింది. బజాజ్ ఆటో.. 2024 పల్సర్ కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. అంతేకాకుండా పల్సర్ లైనప్‌కు కొత్త అప్డేట్స్ తీసుకొచ్చింది.


బజాజ్ ఆటో పల్సర్ ఎన్160 కోసం కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ 1.40 లక్షల ఎక్స్-షోరూమ్‌ ధరతో లాంచ్ అయింది. కొత్త టాప్-ఎండ్ వేరియంట్ కొత్త ఫీచర్లతో పాటు మెకానికల్ అప్‌గ్రేడ్‌ను పొందుతుంది. అంతేకాకుండా బజాజ్ పల్సర్ 125, పల్సర్ 150, పల్సర్ 220 ఎఫ్‌లను మరిన్ని కొత్త ఫీచర్లతో అప్డేట్ చేసింది. పల్సర్ ఎన్160 కొత్త వేరియంట్ ప్రస్తుతం టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. అలాగే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో కూడా అందుబాటులోకి వస్తుంది.

ఇది టెలిస్కోపిక్ ఫోర్క్ సెటప్‌కు బదులుగా షాంపైన్ గోల్డ్ కలర్‌తో కొత్త 33MM USD ఫ్రంట్ ఫోర్కులను ఈ బైక్‌లో అమర్చారు. వీటితో పాటు రోడ్ మోడ్, రైన్ మోడ్, ఆఫ్-రోడ్ మోడ్ వంటి మూడు ABS మోడ్‌లను తీసుకొచ్చారు. ఈ ABS మోడ్‌లు గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డులో కూడా మంచి అనుభూతిని అందిస్తాయి.


Also Read: అనుకున్న దానికన్నా తక్కువ ధరకే కొత్త పల్సర్‌ లాంచ్.. ఇక రోడ్లపై రచ్చ రచ్చే

కాగా ఈ కొత్త 2024 బజాజ్ పల్సర్ ఎన్ 160 బైక్‌ 164.82 సిసి ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌‌తో అమర్చబడి ఉంది. ఇంకా ఇది వెనుకవైపు మోనోషాక్ సెటప్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్-ఛానల్ ABS సహాయంతో రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. ఇది బ్రేకింగ్ పనితీరును మరింత స్పీడ్‌గా ఉండేలా మెరుగుపరుస్తుంది. దీనితో పాటు బ్రాండ్ పల్సర్ 125, 150, 220F కోసం కొత్త గ్రాఫిక్స్, ఫీచర్ అప్‌డేట్‌ల శ్రేణిని కూడా పరిచయం చేసింది.

కొత్త అప్‌డేట్‌లో భాగంగా.. పల్సర్ 125, 150, 220F వేరియంట్స్ అన్ని పల్సర్ లైనప్‌లో ఉన్న డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ క్లస్టర్‌ను పొందుతాయి. అంతేకాకుండా మోటార్‌సైకిళ్లు కొత్త USB ఛార్జర్‌ను కూడా పొందుతాయి. పలర్ 125 ఇకపై కార్బన్ ఫైబర్ ఫినిష్డ్ సింగిల్, స్ప్లిట్ సీట్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక వీటి ధర విషయానికొస్తే.. 2024 బజాజ్ పల్సర్ 125 వేరియంట్ సింగిల్ సీట్ ధర రూ.92,883గా ఉంది. అలాగే పల్సర్ 150 సింగిల్ డిస్క్ ధర రూ.1.14 లక్షలుగా ఉంది. ఇక దీని హై వేరియంట్ 2024 పల్సర్ 220ఎఫ్ వేరియంట్ ధర రూ.1.41 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇవన్నీ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధరలే.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×