BigTV English

Donald Trump: నన్ను గెలిపిస్తే పన్ను నుంచి విముక్తి కల్పిస్తా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన ట్రంప్

Donald Trump: నన్ను గెలిపిస్తే పన్ను నుంచి విముక్తి కల్పిస్తా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన ట్రంప్

Donald Trump Best Offer For America Citizens: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల రేసులో పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉంటున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు.


పన్ను విముక్తి..
రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆదాయ పన్ను నుంచి అమెరికన్లను విముక్తి కలిగిస్తానని ప్రకటించారు. ఏకంగా పన్ను చెల్లింపుల నుంచి విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై అమెరికాలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ ప్రతిపాదనపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ పన్ను నుంచి విముక్తి కలిగించడమంటే..సంపన్నులకు లబ్ధి చూకూర్చడమేనని కొంతమంది విమర్శిస్తున్నారు. పన్ను స్థానంలో టారిఫ్‌ల పాలసీని అమల్లోకి తీసుకురావడమంటే.. దిగువ, మధ్య తరగతి అమెరికన్లను తీవ్రంగా దెబ్బతీయడమేనని మరికొంతమంది ఆరోపిస్తున్నారు.

గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో విదేశాంగ విధానంలో సుంకాలను బహుముఖ అస్త్రంగా ప్రయోగించాడు. మళ్లీ ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై విజయం సాధిస్తే మరింత మెరుగ్గా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రక్షణాత్మక ధోరణితో కూడిన వాణిజ్య ఎజెండాను అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదనలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.


Also Read:  అందుకు మీరు ఒప్పుకుంటే మేం వెంటనే కాల్పుల విరమణ చేస్తాం: రష్యా

వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ క్లబ్‌లో అమెరికా పార్లమెంట్ సభ్యులతో ట్రంప్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీలో సమస్యాత్మక సంస్థలతో జరిపే చర్చల్లో సుంకాలను సాధనంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. ట్రంప్ ప్రకటన మంచి పరిణామమని మద్దతు తెలుపుతున్నారు.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×