BigTV English

Bajaj Freedom 125 CNG: బజాజ్ CNG.. 3 నెలలు ఆగాల్సిందే.. క్రాష్ టెస్ట్ చేసిన మొదటి బైక్!

Bajaj Freedom 125 CNG: బజాజ్ CNG.. 3 నెలలు ఆగాల్సిందే.. క్రాష్ టెస్ట్ చేసిన మొదటి బైక్!

Bajaj Freedom 125 CNG: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ బజాజ్ ఇండియా ప్రపంచ మొట్టమొదటి CNG బైక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బైక్ సేల్స్ కూడా మొదలైనప్పికీ డెలివరీ చేసేందుకు బజాజ్ ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. బైన్ నిరంతరం బుకింగ్‌లను దక్కించుకుంటుంది. బైక్ ధర రూ.95,000 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్రీడమ్ 125 సిఎన్‌జి డెలివరీ కోసం 45 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉంది. కానీ పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ బైక్‌పై వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు కూడా ఈ బైక్‌ను బుక్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ క్రింద విషయాలను గురించి తెలుసుకోండి.


సమాచారం ప్రకారం బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్‌పై ప్రస్తుతం 3 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంటే ఈరోజే ఈ బైక్‌ను బుక్ చేసుకుంటే 90 రోజుల తర్వాత ఈ బైక్ మీకు కంపెనీ డెలివరీ చేస్తోంది. కానీ ఇది దాని వేరియంట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. 1,000 రూపాలయలు చెల్లించి బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ పెట్రోల్‌తో పాటు CNGతో నడుస్తుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 సిఎన్‌జిని 3 వేరియంట్‌లలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనితో పాటు ఇది కరీబియన్ బ్లూ, సైబర్ వైట్, ఎబోనీ బ్లాక్/గ్రే, రేసింగ్ రెడ్ కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది.

Also Read: Bajaj Chetak Sales: చితక్కొట్టిన చేతక్.. సేల్స్‌లో రికార్డులే రికార్డులు!


కొత్త ఫ్రీడమ్‌లో 125cc సింగిల్-సిలిండర్ ఇంజన్ 9.5 PS పవర్, 9.7 Nm టార్క్ రిలీజ్. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. మార్కెట్‌లో ఉన్న ఇతర 125సీసీ బైక్‌లతో పోలిస్తే ఈ ఇంజన్ కొంచెం తక్కువ పవర్‌తో ఉంటుంది. ఈ ఇంజన్‌తో పాటు CNG కూడా ఉంటుంది. బజాజ్ ఈ ఇంజన్‌ని పవర్, మైలేజ్ మధ్య బ్యాలెన్స్ ఉండే విధంగా ట్యూన్ చేసింది. దీని ఎగ్జాస్ట్ సౌండ్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లానే ఉంటుంది.

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ కేవలం 2 కిలోల CNG సిలిండర్‌ను కలిగి ఉంటుంది.  ఇది ఫుల్ ట్యాంక్‌తో 200 కిలోమీటర్ల రేంజ్ అందిస్తోంది. ఇందులో 2 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ మాత్రమే ఉంది. దీని కారణంగా ఈ బైక్ 130 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. మొత్తంమీద ఈ బైక్ 330 కిలోమీటర్ల (CNG + పెట్రోల్) వరకు నడుస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ బైక్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ స్పీడోమీటర్, సిఎన్‌జి, హ్యాండిల్‌బార్‌పై పెట్రోల్ షిఫ్ట్ బటన్, యుఎస్‌బి పోర్ట్, పొడవైన సీటు, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

బజాజ్ ఈ బైక్‌లో భద్రత పరంగా ఎటువంటి రాజీ పడలేదు. దాని ఇంధన ట్యాంక్ మధ్యలో CNG ట్యాంక్ కూడా ఉంటుంది. బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. దాని చుట్టూ బలమైన ఫ్రేమ్ కూడా అందించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన CNG ట్యాంక్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మాత్రమే కాదు CNG గ్యాస్ లీక్ అవ్వదు. ఇది రైడర్‌కు ఫుల్ సేఫ్టీని అందిస్తోంది.

Also Read: Ola First Electric Bike: ఓలా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్.. ఆగస్టు 15న లాంచ్.. ఫీచర్లు సూపర్!

దేశంలో క్రాష్ టెస్ట్ చేసిన మొదటి బైక్ ఇదే. ప్రమాదం సమయంలో రైడర్‌కు ఎలాంటి హాని జరగకుండా చూసేందుకు బైక్ 11 సేఫ్టీ టెస్టుల్లో మంచి మార్కులు సాధించింది. బైక్‌పై నుంచి 10 టన్నుల బరువున్న ట్రక్కు వెళ్లినప్పటికీ బైక్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. బ్రేకింగ్ కోసం బైక్ ఫ్రంట్, బ్యాక్ టైర్లను డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×