BigTV English

Bajaj Freedom 125 CNG: స్పీడ్ పెంచిన బాజాజ్.. ఆగస్టు 15 న 77 సిటీల్లో ఫ్రీడమ్ సీఎన్‌జీ బైక్!

Bajaj Freedom 125 CNG: స్పీడ్ పెంచిన బాజాజ్.. ఆగస్టు 15 న 77 సిటీల్లో ఫ్రీడమ్ సీఎన్‌జీ బైక్!

Bajaj Freedom 125 CNG: బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీతో నడిచే బైక్‌ను విడుదల చేసి గ్లోబల్ ఆటోమోటివ్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఫ్రీడమ్ 125 బజాజ్ నుండి వచ్చిన సీఎన్‌జీ బైక్‌లలో మొదటిది. ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్రీడమ్ 125 ధర రూ.95,000 ఎక్స్ షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్‌ విడుదలైన తర్వాత విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వరుస బుకింగ్‌లతో దూసుకుపోతుంది.


ఈ క్రమంలోనే ఆగస్టు 15న 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో 77 షోరూమ్‌లలో  ఫ్రీడమ్ సీఎన్‌జీని అందుబాటులోకి తీసుకురానుంది. భారత్ ఆగస్టు 15న 77వ స్వాతంత్రంలోకి అడుగుపెడుతుంది. అందుకనే 77 సంఖ్యను ఎంచుకుంది బజాజ్. ఫ్రీడమ్ 12 లాంచ్ అయినప్పటి నుండి మొదటి వారంలో 30,000కి పైగా బుకింగ్స్ వచ్చినట్లు బజాజ్ పేర్కొంది. బజాజ్ యొక్క ఫ్రీడమ్ 125 అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి CNG-ఇంటిగ్రేటెడ్ బైక్.

Also Read: Upcoming Bikes In August: డబ్బులు రెడీ చేస్కోండి.. ఆగస్టులో అదిరిపోయే బైక్‌లు వస్తున్నాయి!


ఈ బైక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఢిల్లీలో రూ.95,00. జూలై 5న ప్రారంభించిన తర్వాత మొదటి ఫ్రీడమ్ 125 బైక్ 16 జూలై 2024న పూణేలోని కస్టమర్‌కు డెలివరీ చేశారు. బజాజ్ ఫ్రీడమ్ 125 డ్రైవింగ్ ద్వారా కస్టమర్లు తమ ఫ్యూయల్ దాదాపు 50 శాతం తగ్గించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది 2 లీటర్ ఆక్సిలరీ పెట్రోల్ ట్యాంక్‌తో డ్యూయల్ ఫ్యూయల్ కెపాసిటీని కలిగి ఉంది. రెండు ఇంధనాలతో 330 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

బజాజ్ ఫ్రీడమ్ 125 ఇలాంటి పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే 50 శాతం వరకు తక్కువ ఆపరేషన్ ఖర్చులను కస్టమర్‌కు అందిస్తుంది. దీని లెటెస్ట్ సేఫ్టీ ఫీచర్ల కోసం ట్రేల్లిస్ ఫ్రేమ్‌లో అమర్చబడిన ఇంటిగ్రేటెడ్ CNG ట్యాంక్, 2 కిలోల CNGపై 200 కిమీల రేంజ్ అందిస్తుంది. కంపెనీ ప్రకారం 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్ సహాయంతో ఈ బైక్ మొత్తం 330 కి.మీలకు వరకు నడుస్తుంది. ఫ్రీడమ్ 125 మోనో-లింక్డ్ సస్పెన్షన్, లాంగ్-క్విల్టెడ్ సీట్, LED హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంది.

Also Read: Upcoming SUV in August: కొత్త కార్లు వస్తున్నాయి.. డిజైన్ అదిరిపోయింది.. రేంజ్‌లో తగ్గేదే లేదు!

CNG ట్యాంక్, కిట్ భద్రత కోసం కంపెనీ అనేక పెద్ద స్థాయిలలో దీనిని టెస్ట్ చేసింది. ట్రక్కును ఢీకొట్టడం నుండి ట్రక్కును దాటడం వరకు అనేక స్థాయిలలో ఈ పరీక్ష జరిగింది. ఇది కస్టమర్ల భయాన్ని తగ్గిస్తుంది. బైక్ మొదటి వేరియంట్ డ్రమ్, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 95,000, రెండవ వేరియంట్ డ్రమ్ LED, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.05 లక్షలు, మూడవ వేరియంట్ డిస్క్ LED. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షలు.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×