BigTV English

Upcoming Bikes In August: డబ్బులు రెడీ చేస్కోండి.. ఆగస్టులో అదిరిపోయే బైక్‌లు వస్తున్నాయి!

Upcoming Bikes In August: డబ్బులు రెడీ చేస్కోండి.. ఆగస్టులో అదిరిపోయే బైక్‌లు వస్తున్నాయి!

Upcoming Bikes In August: మీరు భారీ ఇంజన్‌తో కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే డబ్బును సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే ఒకటి, రెండు కాదు, నాలుగు కొత్త బైక్‌లు ఆగస్టులో విడుదల కానున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా ఆవిష్కరించనుంది. అంతేకాకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి యెజ్డీ వరకు బైక్‌లను కూడా విడుదల కానున్నాయి. ఈ బైక్‌లన్నీ ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్లను కూడా లక్ష్యంగా వస్తున్నాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.


Ola Electric Bike
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తర్వాత కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై దృష్టి పెట్టింది. నివేదికల ప్రకారం కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. కొత్త మోడల్‌ను ఆగస్టు 15న అందుబాటులోకి రావచ్చు. తాజాగా కంపెనీ కొత్త మోడల్ టీజర్‌ను కూడా విడుదల చేసింది. కొత్త మోడల్ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో ఉంటుంది. దీని ధర తక్కువగా ఉంటుంది. మైలేజీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి ముందు కూడా ఓలా భారతదేశంలో ఆగస్టు 15 న కొత్త మోడల్‌ను విడుదల చేసింది.

Also Read: Upcoming SUV in August: కొత్త కార్లు వస్తున్నాయి.. డిజైన్ అదిరిపోయింది.. రేంజ్‌లో తగ్గేదే లేదు!


Royal Enfield Classic 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త క్లాసిక్ 350 ఫేస్‌లిఫ్ట్‌ను ఈ సంవత్సరం ఆగస్టు నెలలో పరిచయం చేయనుంది. కొత్త మోడల్‌లో కొన్ని మార్పులు కనిపించవచ్చు. కొత్త మోడల్‌లో కొత్త హెడ్‌లైట్లు, కొత్త కలర్స్, పెయింట్ స్కీమ్, అప్‌డేట్ చేయబడిన ఇంజన్ లభిస్తాయి లీక్స్ వస్తున్నాయి. ఇది డిజిటల్ స్పీడోమీటర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది అనేక మంచి ఫీచర్లతో వస్తుంది.

Yezdi Adventure
మీరు జావా యెజ్డీ ఫ్యాన్ అయితే మీకు శుభవార్త ఉంది. అదేమిటంటే అప్‌డేట్ చేయబడిన Yezdi అడ్వెంచర్ బైక్ ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల కానుంది. ఈ బైక్ ప్రత్యక్ష పోటీ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450తో ఉంటుంది. బైక్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

ఇటీవలే ఈ బైక్ టీజర్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ కనిపిస్తుంది. కొత్త గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు. ఇంజన్ గురించి మాట్లాడితే బైక్ 334cc ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈసారి బైక్‌లో మెకానికల్ మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా బైక్ సస్పెన్షన్, ఎగ్జాస్ట్, ఫీచర్లను కూడా అప్‌డేట్ చేయవచ్చు.

Also Read: Best Panoramic Sunroof Cars: సన్‌రూఫ్‌ కార్లు.. టాప్ ప్లేస్‌ వీటికే సొంతం!

BSA Gold Star 650
దేశంలో BSA తన కొత్త గోల్డ్ స్టార్ 650 రెట్రో బైక్‌ను అప్‌డేట్ వెర్షన్‌ను పరిచయం చేయనుంది. ఆగస్టు నెలలో దీన్ని విడుదల చేయవచ్చు. ఇంజన్ గురించి మాట్లాడితే BSA గోల్డ్ స్టార్ 652 cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌‌తో వస్తుంది. ఇది 44.3 bhp పవర్, 55 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండవు. అయితే ఈ బైక్‌లో చాలా మంచి ఫీచర్లు ఉండే అవకాశం ఉండి.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×