BigTV English

Parthasarathy Vs Jagan: మాటలొద్దు జగన్.. దమ్ముంటే అసెంబ్లీకి రా : మంత్రి పార్థసారథి

Parthasarathy Vs Jagan: మాటలొద్దు జగన్.. దమ్ముంటే అసెంబ్లీకి రా : మంత్రి పార్థసారథి

Parthasarathy fires on Jagan(Political news in AP): ఏపీ మంత్రి పార్థసారథి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్ పత్రికలపై చర్యలు తీసుకుంటామంటూ ఆయన పేర్కొన్నారు. మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ పార్థసారథి సవాల్ విసిరారు. ఆగస్టు 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పెన్షన్ అందిస్తామంటూ మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు రాతలు రాయడం తగదంటూ ఆయన హితవు పలికారు.


గత వైసీపీ ప్రభుత్వం చేతగానితనం వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ ఆయన ఆరోపించారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయంటూ మంత్రి గుర్తుచేశారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్ మోహన్ రెడ్డిదంటూ పార్థసారథి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీ అభివృద్ధికి, ప్రజా ఆరోగ్యానికి కట్టుబడి ఉన్నారని మంత్రి వెల్లడించారు.

Also Read: నెల్లూరు లో బయటపడ్డ వైసీపీ భారీ స్కాం.. చిక్కుల్లో మేయర్


ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంపై పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా మండిపడ్డారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పట్టించుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి వస్తే వారి నుంచి వాటాలు అడిగేవారంటూ ఆయన ఆరోపించారు. ఏపీకి కొత్త పారిశ్రామి విధానాన్ని తీసుకొస్తామన్నారు. అది కూడా వంద రోజుల్లోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామన్నారు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీని పరిశ్రమల కోసం తెస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు. ఏపీకి చంద్రబాబే పెద్ద బ్రాండ్ అని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తలకు నమ్మకం కలిగిస్తే చాలు.. పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాలిసిన అనుమతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి చెప్పారు. కొత్తగా లేపాక్షి, కుప్పం, దొనకొండ, మూలపేట ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రీయల్ క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×