E-Paper
Advertisement

ఉద్యోగం మానేసి వ్యాపారం చేయండి నేన్నున్నా.. టాలెంటెడ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న కంపెనీ బాస్

ఉద్యోగం మానేసి వ్యాపారం చేయండి నేన్నున్నా.. టాలెంటెడ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న కంపెనీ బాస్
Advertisement

Employee startup opportunities| సాధారణంగా కంపెనీలు తమ ప్రతిభావంతులైన ఉద్యోగులు వేరే కంపెనీలకు వెళ్లకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ, బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తోంది. ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదిలి సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ప్రోత్సహిస్తోంది. అంతేకాదు, వారి వ్యాపార ప్రయాణంలో ఆర్థికంగా, వృత్తిపరంగా అండగా నిలుస్తామని ఆ కంపెనీ బాస్ హామీ ఇస్తున్నారు. ఒకవేళ వ్యాపారం విజయవంతం కాకపోతే తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇంతకీ ఆ కంపెనీ ఏది? ఉద్యోగులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తోంది?

ఉద్యోగులు వ్యాపారవేత్తలుగా మారేందుకు కొత్త అవకాశం

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫుడ్ కంపెనీ ఐడీ ఫ్రెష్ ఫుడ్ (iD Fresh Food) ఉద్యోగుల కోసం వినూత్న పాలసీ ప్రకటించింది. సంస్థ గ్లోబల్ CEO ముస్తఫా పి (Musthafa P) ఈ కొత్త కార్యక్రమాన్ని వెల్లడించారు. ఈ పాలసీ ప్రకారం.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఉద్యోగులకు కంపెనీ సహకరిస్తుంది. వారి వ్యాపార ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తుంది.
కంపెనీ నాయకత్వ బృందం నుంచి మెంటార్‌షిప్ పొందే అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా, కంపెనీకి ఉన్న వ్యాపార భాగస్వాములు, నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

Advertisement

ఉద్యోగులు తమ వ్యాపార ఆలోచనలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు పాక్షిక వేతనంతో కూడిన సబాటికల్ సెలవు కూడా పొందవచ్చు. దీనివల్ల ప్రారంభ దశలో ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గించుకోవచ్చు.
ముఖ్యంగా, వ్యాపారం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే తిరిగి ఐడీ ఫ్రెష్ ఫుడ్‌లో ఉద్యోగంలో చేరవచ్చు. దీంతో ఉద్యోగులు తమ భవిష్యత్తుపై భయపడకుండా కొత్త ప్రయత్నాలు చేయవచ్చు.

రూ.50 వేలతో ప్రారంభమైన ఐడీ ఫ్రెష్ ఫుడ్ ప్రయాణం!

ఈ కొత్త విధానం వెనుక తన జీవిత అనుభవమే ఉందని ముస్తఫా తెలిపారు. లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్టులో కంపెనీ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. 2005లో బెంగళూరులోని ఒక చిన్న వంటగదిలో కేవలం రూ.50 వేలతో ఐడీ ఫ్రెష్ ఫుడ్ ప్రయాణం ప్రారంభమైంది. ముస్తఫా తన కజిన్స్‌తో కలిసి ఈ వ్యాపారాన్ని స్థాపించారు.
ప్రారంభంలో ఎన్నో తప్పులు జరిగాయి. నిద్రలేని రాత్రులు, అనిశ్చితి, ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ, కొంతమంది తమపై నమ్మకం ఉంచడంతో వెనుకడుగు వేయలేదని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో తమకు లభించిన ప్రోత్సాహాన్ని ఇప్పుడు ఉద్యోగులకు అందించాలని ముస్తఫా భావిస్తున్నారు. సొంతంగా ఎదగాలనుకునే వారికి తగిన అవకాశాలు కల్పించాలనుకుంటున్నారు.

Advertisement

Also Read: చాణక్య నీతి.. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి 7 మార్గాలు

ఉద్యోగులు కంపెనీని విడిచివెళ్లినా సంతోషమే

సాధారణంగా ప్రతిభావంతులైన ఉద్యోగులు కంపెనీ విడిచిపెడితే యాజమాన్యాలు బాధపడతాయి. కానీ ముస్తఫా మాత్రం దీనికి భిన్నంగా చూస్తున్నారు. తమ ఉద్యోగులు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తే గర్వపడతానని తెలిపారు. వారు సమాజానికి మరింత విలువ సృష్టించాలని ఆకాంక్షించారు. ముస్తఫా ఎన్‌ఐటీ కాలికట్‌లో చదువుకున్నారు. ఐఐఎం బెంగళూరులో ఉన్నత విద్యను పూర్తి చేశారు. వ్యాపారవేత్తగా మారకముందు మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేశారు.

Also Read: వివాహ బంధంలో ఒకరు మోసం చేస్తే విడిపోవాల్సిందినా? లేదా మోసం చేసిన వ్యక్తికి మరో అవకాశం ఇవ్వాలా?

ఉద్యోగుల కలలకు అండగా ఐడీ

ప్రతి స్టార్టప్ విజయవంతం అవుతుందని చెప్పలేం. అయితే ప్రయత్నించాలనుకునే ప్రతిఒక్కరికీ సరైన మద్దతు ఎంతో అవసరం. ఉద్యోగ భద్రతను పూర్తిగా వదులుకోకుండానే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఈ విధానం కల్పిస్తోంది. ఇతర కంపెనీలు కూడా ఇలాంటి విధానాలను అనుసరిస్తే మరింతమంది ఉద్యోగులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది.

Related News

పసిడి ధరలకు బ్రేక్.. సామాన్యుడికి సరైన అవకాశం! ధరలు ఎలా ఉన్నాయి?

మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ ప్రారంభం.. పెట్టుబడుదారులకు పండగే, ఇష్యూ ప్రైస్‌తోపాటు జీఎంపీ

ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు ఏఐ కంపెనీ ఓనర్.. ఎలా ఎదిగాడంటే

బంగారం ధరలు భారీ పతనం.. ఇప్పుడు కొనచ్చా?

పండుగ ఆఫర్లు లేవు.. హంగూ ఆర్భాటం ఉండదు.. అయినా సామాన్యుల అడ్డాగా డీమార్ట్ ఎలా మారింది?

UPI ఛార్జీల ఇష్యూ.. కేంద్రానికి పేమెంట్ సంస్థల విన్నపాలు, అమలు చేయాలంటూ

ఏఐతో 2028 కల్లా ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ముప్పు.. హెచ్చరించిన అమెరికా నిపుణులు

Big Stories

Advertisement
×