Aadarsha Kutumbam Movie:త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇకపోతే విడుదల అయిన రోజు నుంచి మొన్నటి వరకు ఈ సినిమాపై ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ బ్యూటీ పూజిత పొన్నాడ ఈ సినిమాపై ఆరోపణలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
పూజిత పొన్నాడ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆదర్శ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.పూజిత మాట్లాడుతూ.. “నేను అమెరికాలో ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, ఈ సినిమా గురించి చెప్పారు. అయితే త్రివిక్రమ్ గారి సినిమా అనగానే నేను సంతోషించాను. ఆడిషన్స్ కి రమ్మన్నారు. వెంటనే హైదరాబాద్ కి వచ్చాను. పైగా త్రివిక్రమ్ నన్ను ఎంపిక చేశారు. మొత్తానికి షూటింగ్ మొదలైంది. నన్ను షూటింగ్ కి పిలిచారు. ఆ తర్వాత మూడు నెలల పాటు సెకండ్ షెడ్యూల్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ కి నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు. మరో అసిస్టెంట్ డైరెక్టర్ కి ఫోన్ చేస్తే.. మేడం మన షూటింగ్ లేదు అన్నారు. మన షూటింగ్ లేదు అంటే అర్థం ఏంటి ? క్లియర్ గా చెప్పండి అన్నాను. అయితే మీ రోల్ లోకి ఇంకో అమ్మాయిని తీసుకున్నారు. అని చెప్పారు. అప్పుడే నేను షాక్ అయ్యాను.
ఒక ప్రాసెస్ ప్రకారం నన్ను ఎంపిక చేసి.. మళ్లీ చెప్పా పెట్టకుండా తొలగించడం ఏంటి? అంటూ కోపం వచ్చింది. పైగా ఫీల్ అయ్యాను. తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక నాకు మరో షాక్ తగిలింది. ఒక సీన్ లో నేను కనిపించాను కూడా.. పైగా ఆ ఒక్క సీన్ కోసమే నన్ను వాడుకున్నారు అంటూ పూజిత ఆదర్శ కుటుంబం మూవీ పై ఈమె విమర్శలు గుప్పించింది. మొత్తానికైతే పూజిత పొన్నాడ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది త్రివిక్రమ్ పనేనా లేక మరేదైనా జరిగిందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
also read: ముఖేష్ ట్రాప్ లో పడ్డ త్రిగుణ్..మరీ ఇంత వెర్రోడా?
ఇదిలా ఉండగా పూజిత పొన్నాడ అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకించి వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా షూటింగ్ సమయంలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ తెలిపింది. రంగస్థలం సినిమాలో నటించినప్పుడు సినిమాపై తనకు ఇష్టం పెరిగిందని.. కానీ వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా చేశాక ఎందుకు చేశానా? అనిపించింది అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది. మరి పూజిత పొన్నాడ ఆదర్శ కుటుంబంపై చేసిన ఆరోపణలకు చిత్ర బృందం స్పందిస్తుందేమో చూడాలి.