Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సెలబ్రిటీ టాక్ షో కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల అయింది. ఈ ప్రోమో వీడియోలో భాగంగా ఈ వారం 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య శర్మ (Ananya Sharma)పాల్గొన్నారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా అనన్య శర్మ తన పర్సనల్ లైఫ్ అలాగే కెరియర్ కి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఇక అనన్య శర్మ చాలా గ్యాప్ తర్వాత హై(High) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అనన్య కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే యాంకర్ వర్ష మాట్లాడుతూ చాలా గ్యాప్ తర్వాత హై సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అనన్య దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.
తనకు సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ రావడానికి గల కారణాలను ఈమె తెలియచేస్తూ.. సరైన కథ దొరకలేదు అదేవిధంగా నాకు సినిమాలలో ఇంటిమేట్ సీన్లతో ఎలాంటి ఇబ్బంది లేదు, అలాగే పొట్టి పొట్టి దుస్తులతో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ, నాకు ఏదైనా సమస్య ఉంది అంటే ఈ అమ్మాయిని ఎలాగోలగా అంటూ ఈమె మాట్లాడారు. అయితే ఆమె మాట్లాడిన మాటలను మ్యూట్ చేసేసారు . ఇక అనన్య మాట్లాడిన మాటలను బట్టి చూస్తుంటే ఈమె ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) గురించే మాట్లాడారని అలాంటి ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలోనే తాను సినిమాలకు కమిట్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నానని చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక ఈ విషయం గురించి అనన్య ఎలాంటి సమాధానం చెప్పారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రతి ఆదివారం రాత్రి 8:00 కు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది.ఇక ఈమె హై సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మీ వ్యక్తిగత జీవితంలో హై మూమెంట్ అంటే ఏంటి అంటూ ప్రశ్న వేయగా అలాంటివన్నీ ఇక్కడ చెప్పకూడదు కదా అంటూ అనన్య చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమంలో ఈమె తన ఫ్యామిలీ గురించి అలాగే కెరియర్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
Also Read: పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలలో రష్మిక సందడి!