E-Paper
Advertisement

పసిడి ధరలకు బ్రేక్.. సామాన్యుడికి సరైన అవకాశం! ధరలు ఎలా ఉన్నాయి?

పసిడి ధరలకు బ్రేక్.. సామాన్యుడికి సరైన అవకాశం! ధరలు ఎలా ఉన్నాయి?
Advertisement

Gold Price Today: అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడడంతో బంగారం-వెండి ధరలు పతనం దిశగా నడుస్తోంది. ఈ ఆరంభంలో ఆకాశాన్ని తాకిన వీటి ధరలు, ఇప్పుడు మెల్లగా దిగి వస్తున్నాయి. ధరల తగ్గడం సామాన్యుడికి ఊరట కలిగించే అంశం.

పసిడి ప్రియులకు తీపికబురు

కాలం మారింది.. పరిస్థితులు మారాయి. ఒకప్పుడు పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ వస్తుందంటే చాలు, బంగారం, వెండి ధరల ఆశాకాన్ని ఎగిసి పడేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. బంగారం-వెండి ధరలు పతనం అవుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో తారాజువ్వాలా ఎగిసిన పసిడి, వెండి ధరలు అదే స్థాయిలో పతనమవుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు పెంచింది. ఫలితంగా పసిడి వైపు చూడడం మానేశారు ఇన్వెస్టర్లు.

దిగివస్తున్న బంగారం, వెండి ధరలు!

Advertisement

ఫలితంగా పసిడి-వెండి కొనుగోళ్లు గణనీయంగా తగ్గడంతో ధరలు పతనమయ్యాయి.. అవుతూనే ఉన్నాయి కూడా. గురువారం హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1.33 లక్షలకు దిగి వచ్చింది. బుధవారం ముగింపు ధర రూ.1.35 లక్షలు ఉండగా.. గురువారం రూ.1,33,805 లకు పడిపోయింది. ఏకంగా రూ.1700 లు తగ్గింది. బుధవారం కిలో వెండి రూ.1.68 లక్షల వద్ద ముగిసింది. గురువారం మార్కెట్లో మూడువేల వరకు పతనమై రూ.1.65 లక్షల వద్ద లావాదేవీలు కొనసాగుతున్నాయి.

దేశీయ మార్కెట్లో ఒక్కో నగరంలో పన్నుల బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్నింటి కంటే ఢిల్లీ, చెన్నైలో విలువైన లోహాల ధరలు కాస్త రూ. 100 నుంచి రూ.500 ఎక్కువగా హెచ్చుగా కనిపిస్తోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ ధరల విషయానికి వద్దాం. స్పాట్ గోల్డ్‌ ధర మరింత పతనమైంది. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 3710 డాలర్ల వద్ద లావాదేవీలు కొనసాగుతున్నాయి. వెండి ధర 44.88 డాలర్లకు కిందకు పడిపోయింది. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర రూ.1,28,878 వద్ద కొనసాగుతోంది. సిల్వర్‌ ఫ్యూచర్‌ కేజీ ధర రూ.1,59,819 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

Advertisement

ALSO READ: ఉద్యోగం మానేసి వ్యాపారం చేయండి నేన్నున్నా.. టాలెంటెడ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న కంపెనీ బాస్

బంగారం, వెండి వరుసగా నాలుగో సెషన్‌లో కూడా వాటి క్షీణత కొనసాగింది. 2026 ప్రారంభంలో వాటి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం బంగారం- వెండి ధరలలో బలహీనత చోటుచేసుకుంది. విలువైన లోహాల మార్కెట్ అమ్మకాల ఒత్తిడి కారణంగా నవంబర్‌లో వాటి ధరలు అత్యంత కనిష్ట స్థాయిలకు చేరుకున్నాయి.

Related News

ఉద్యోగం మానేసి వ్యాపారం చేయండి నేన్నున్నా.. టాలెంటెడ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న కంపెనీ బాస్

మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ ప్రారంభం.. పెట్టుబడుదారులకు పండగే, ఇష్యూ ప్రైస్‌తోపాటు జీఎంపీ

ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు ఏఐ కంపెనీ ఓనర్.. ఎలా ఎదిగాడంటే

బంగారం ధరలు భారీ పతనం.. ఇప్పుడు కొనచ్చా?

పండుగ ఆఫర్లు లేవు.. హంగూ ఆర్భాటం ఉండదు.. అయినా సామాన్యుల అడ్డాగా డీమార్ట్ ఎలా మారింది?

UPI ఛార్జీల ఇష్యూ.. కేంద్రానికి పేమెంట్ సంస్థల విన్నపాలు, అమలు చేయాలంటూ

ఏఐతో 2028 కల్లా ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ముప్పు.. హెచ్చరించిన అమెరికా నిపుణులు

Big Stories

Advertisement
×