BigTV English

Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు తొమ్మిది రోజులు సెలవులే

Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు తొమ్మిది రోజులు సెలవులే

Holidays List: ఆగస్టు నెలలో బ్యాంకులకు బోలెడు సెలువులు వస్తున్నాయి. బ్యాంకులకు వెళ్లడానికి ముందు ఈ సెలవుల జాబితాను చూసి వెళ్లడం ఉత్తమం. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవులను నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. రాఖీ బంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, క్రిష్ణాష్టమి పండుగలు ఆగస్టు నెలలోనే రాబోతుండటంతో బ్యాంకు హాలీడేలు పెరిగాయి. ఆర్బీఐ వివరాలు ప్రకారం, ఆగస్టు నెలలో బ్యాంకు సెలవులు ఇలా ఉన్నాయి.


ఆగస్టు 4వ తేదీన ఆదివారం, ఆగస్టు 10వ తేదీన రెండో శనివారం, ఆగస్టు 11వ తేదీన ఆదివారం సాధారణ సెలవులు. ఇక ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి బ్యాంకులకు హాలీడే ఉంటుంది. ఆ తర్వాత మూడు రోజులకే ఆగస్టు 18వ తేదీన ఆదివారం అవుతున్నది. మరుసటి రోజే ఆగస్టు 19న రక్షా బంధన్ వస్తున్నది. చాలా రాష్ట్రాల్లో ఈ పండుగకు బ్యాంకు సెలవులు ఉన్నాయి. ఆగస్టు 24వ తేదీన నాలుగో శనివారం కూడా సెలవే. 25న ఆదివారం జనరల్ హాలీడే. 26వ తేదీన క్రిష్ణాష్టమి వస్తున్నది. ఈ లెక్కన చివరి వారంలో ఆగస్టులో సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. 24వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులపాటు సెలవులే వస్తున్నాయి. కాబట్టి, బ్యాంకులకు వెళ్లేవాళ్లు ఈ వివరాలను దృష్టిలో ఉంచుకోవడం బెటర్.

Also Read: Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో వాళ్లను గెలిపించుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


మరికొన్ని రాష్ట్రాల్లో వీటికి అదనంగా కూడా కొన్ని సెలవులు ఉన్నాయి. మొత్తంగా ఆగస్టులో 13 రోజుల సెలవులు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో ఆయా పండుగలను బట్టి ఈ సెలవులు ఉన్నాయి. ఉదాహరణకు ఆగస్టు 3వ తేదీన కేర్ పూజా కోసం అగర్తలా రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ఉన్నది. ఆగస్టు 8వ తేదీన సిక్కిం లో సెలవు. ఆగస్టు 13వ తేదీన అమరువీరుల దినోత్సవం సందర్భంగా మణిపూర్‌ లో బ్యాంకులకు సెలవు ఉన్నది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×