Jio-Google Gemini Pro: జియో యూజర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌కు ఉచిత యాక్సెస్‌ను అందించడానికి గూగుల్‌తో చేతులు కలిపింది. ₹35,100 విలువైన ఈ ప్లాన్, అర్హత కలిగిన అపరిమిత 5G ప్లాన్‌లకు సభ్యత్వం పొందిన జియో వినియోగదారులకు అందుబాటులో వచ్చింది.
గురువారం (అక్టోబర్ 30న) ప్రారంభించబడిన ఈ ప్లాన్ విద్యార్థుల కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ప్లాన్ కు 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారు అర్హులు. దేశవ్యాప్తంగా తమ యూజర్లకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో పేర్కొంది. దీని ద్వారా వినియోగదారులు గూగుల్ జెమిని 2.5 ప్రో మోడల్, 2 TB క్లౌడ్ స్టోరేజ్, వియో 3.1 ద్వారా వీడియో జనరేషన్, నానో బనానా ద్వారా ఇమేజ్ క్రియేషన్‌తో సహా అనేక ప్రీమియం AI-ఆధారిత సేవలను పూర్తిగా పొందుతారు.
సబ్‌స్క్రైబర్లు నోట్‌బుక్‌ఎల్‌ఎమ్, జెమిని కోడ్ అసిస్ట్, జిమెయిల్, గూగుల్ డాక్స్‌లో జెమిని ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లను కూడా పొందుతారు. అర్హత ఉన్న వినియోగదారుల కోసం యాక్టివేషన్‌ను మైజియో యాప్ ద్వారా “క్లెయిమ్ నౌ” ఎంపికను ఎంచుకోవడం ద్వారా నేరుగా చేయవచ్చు. ప్రస్తుత జెమిని ప్రో సబ్‌స్క్రైబర్లు వారి ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌లు గడువు ముగిసిన తర్వాత ఉచిత ‘గూగుల్ AI ప్రో – పవర్డ్ బై జియో’ ప్లాన్‌కు మారవచ్చు.
గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ గూగుల్-జియో భాగస్వామ్యంపై స్పందిస్తూ, “గూగుల్ అత్యాధునిక AI సాధనాలను యూజర్లు, వ్యాపారాలు, భారతదేశంలోని డెవలపర్ కమ్యూనిటీ చేతుల్లో ఉంచుతుంది. ఈ భాగస్వామ్యం భారతదేశం అంతటా AIని విస్తరించడంలో ఎలా సహాయపడుతుందో తెలుసుకోవడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను” అని అన్నారు.
ALSO READ: ChatGPT – OpenAI: షాకింగ్.. సూసైడ్ ఆలోచనలో 12లక్షల మంది ChatGPT యూజర్స్!