E-Paper
Advertisement

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో
Advertisement

Anime Series on OTT : ఇప్పటివరకు మనుషులకు, టైటాన్లకు మధ్య జరుగుతున్న యుద్ధమే అనుకున్నాం. కానీ అసలు ప్రమాదం గోడల బయట కాదు… గోడల లోపలే ఉంటే ? ఎరెన్, హిస్టోరియాలను ఎందుకు కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు ? లీవాయ్ గతం నుంచి వచ్చిన కెన్నీ ఎవరు ? శిగన్షినాలో జరిగే భీకర యుద్ధంలో ఎర్విన్ సహా ఎంతో మంది సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోతారు ? అన్నింటికంటే ముఖ్యంగా ఎరెన్ తండ్రి దాచిన బేస్‌మెంట్‌ లో ఎలాంటి నిజం బయటపడుతుంది ? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ కథనే మరో స్థాయికి తీసుకెళ్లే సీజన్ Attack on Titan Season 3. ఈ సిరీస్ కు సంబంధించిన విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

టైటాన్లతో పోరాడుతున్న సర్వే కార్ప్స్‌ కు ఒక దశలో అసలు సమస్య బయట లేదనే విషయం అర్థమవుతుంది. గోడల వెనుక ఉన్న రాజ్య వ్యవస్థలోనే పెద్ద కుట్ర జరుగుతుందని తెలుస్తుంది. ఎరెన్, హిస్టోరియాలను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు నకిలీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీంతో సర్వే కార్ప్స్ మానవ శత్రువులతోనే మరో యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈ సమయంలో లీవాయ్ గతంతో సంబంధం ఉన్న కెన్నీ రంగంలోకి దిగుతాడు. అతని దాడులతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయి. మరోవైపు హిస్టోరియా సాధారణ అమ్మాయి కాదని, ఆమె అసలైన రాయల్ బ్లడ్‌ కు చెందిన వారసురాలని బయట పడుతుంది.

Advertisement

ఆమె తండ్రి రాడ్ రీస్ కూడా ఎరెన్ శక్తిని పొందేందుకు ప్రయత్నిస్తాడు. చివరికి అతను భారీ టైటాన్‌గా మారడంతో భీకర పోరాటం జరుగుతుంది. ఆ తర్వాత నకిలీ రాజ్య వ్యవస్థను తొలగించి హిస్టోరియాను రాణిగా ప్రకటిస్తారు. కానీ అసలు యుద్ధం ఇంకా ముందుంది. వాల్ మారియాను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఎరెన్, లీవాయ్, ఎర్విన్ బృందం శిగన్షినాకు వెళ్తుంది. అక్కడ బీస్ట్ టైటాన్, ఆర్మర్డ్ టైటాన్, కొలోసల్ టైటాన్లు ఎదురవడంతో యుద్ధం రక్తపాతంగా మారుతుంది. ఎర్విన్‌తో పాటు అనేకమంది సైనికులు ప్రాణత్యాగం చేస్తారు.

చివరకు ఎరెన్ తన తండ్రి బేస్‌మెంట్‌లో దాచిన డైరీలను చదువుతాడు. అక్కడ బయటపడిన నిజం అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. గోడల మధ్య ఉన్న ప్రపంచం మొత్తం కాదని, వారు నివసిస్తున్నది Paradis అనే ద్వీపమని తెలుస్తుంది. సముద్రం అవతల Marley అనే ఆధునిక దేశం ఉందని, టైటాన్ల వెనుక ఉన్న అసలు చరిత్ర మనుషుల మధ్య జరిగిన రాజకీయ పోరాటాలతో ముడిపడి ఉందని బయట పడుతుంది. దీంతో ఎరెన్ ప్రపంచాన్ని చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. మరి ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ సిరీస్ ను పూర్తిగా చూడాల్సిందే.

Advertisement

Also Read : అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

తెలుగులో స్ట్రీమింగ్ ?

‘అటాక్ ఆన్ టైటాన్ సీజన్ 3’ ప్రస్తుతం Amazon MX Player, అలాగే Prime Videoలోని Anime Times ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్‌కు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ డబ్బింగ్ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. యాక్షన్, డార్క్ ఫాంటసీ, పొలిటికల్ థ్రిల్లర్, మిస్టరీ కలిసిన కథతో ఈ సీజన్ అదిరిపోతుంది. ముఖ్యంగా చివర్లో బయటపడే బేస్‌మెంట్ రహస్యం తర్వాత కథ పూర్తిగా కొత్త దిశలోకి వెళ్తుంది. కాబట్టి ఈ సిరీస్ లవర్స్ ఇంకా సీజన్ 3 చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

 

Related News

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×