URBN 20000 mAh Nano power bank: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫోన్ బ్యాటరీ అయిపోతుందనే భయం చాలా మందిని వేధిస్తుంటుంది. ఈ టెన్షన్‌ను పూర్తిగా దూరం చేయడానికి ప్రముఖ బ్రాండ్ URBN మార్కెట్లోకి ఒక అద్భుతమైన గ్యాడ్జెట్‌ను తీసుకువచ్చింది. అదే URBN 20000 mAh 22.5W నానో పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్. కేవలం రూ. 1,499 ధరకే లభిస్తున్న ఈ పవర్ బ్యాంక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పవర్ బ్యాంక్ ప్రత్యేకత దాని సైజ్. 20000mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్నప్పటికీ, ఇది సాధారణ పవర్ బ్యాంక్‌లలా పెద్దగా ఉండదు. చేతిలో ఇమిడిపోయేలా, ఈజీగా పాకెట్ లో పట్టేలా దీన్ని డిజైన్ చేశారు. పర్పుల్ కలర్ వేరియంట్ తో వస్తున్న ఈ గ్యాడ్జెట్ చూడటానికి చాలా ట్రెండ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లో లేదా పాకెట్‌లో దీన్ని క్యారీ చేయడం చాలా ఈజీ.
ఇది కేవలం చిన్నది మాత్రమే కాదు, పవర్ విషయంలోనూ.. చాలా శక్తివంతమైనది. ఇందులో.. ఉన్న 20000mAh లిథియం పాలిమర్ బ్యాటరీ మీ స్మార్ట్ ఫోన్‌ను ఒకసారే కాకుండా.. వరుసగా అనేక సార్లు పూర్తిగా ఛార్జ్ చేయగలదు. అంతేకాకుండా.. 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. పవర్ డెలివరీ, క్విక్ ఛార్జ్ టెక్నాలజీలు ఇందులో ఉండటం వల్ల మీ మొబైల్ క్షణాల్లో ఛార్జ్ అవుతుంది.
ఈ పవర్ బ్యాంక్ కేవలం స్మార్ట్ ఫోన్‌లకే పరిమితం కాదు. బ్లూటూత్ స్పీకర్లు, ట్యాబ్లెట్లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వంటి అనేక రకాల మల్టి పుల్ గాడ్జెట్లను దీని ద్వారా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఒకేసారి బయటికి.. వెళ్లినప్పుడు మీ ఫోన్, ఇయర్ బడ్స్ రెండు డివైజెస్‌కు బ్యాటరీ అయిపోతే.. ఈ ఒక్క పవర్ బ్యాంక్ ఉంటే చాలు.. అన్ని సమస్యలు తీరిపోతాయి.
Also Read: బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ కావాలా? అయితే..ఈ మోడల్ మీ కోసమే!
ఇన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, హై-కెపాసిటీ బ్యాటరీ ఉన్నప్పటికీ దీని ధర సామాన్యులకు కూడా అందుబాటులో.. ఉండేలా కేవలం రూ.1,499గా నిర్ణయించారు. మార్కెట్లో.. లభించే ఇతర ప్రీమియం పవర్ బ్యాంక్‌లతో పోలిస్తే.. ఈ ధరకు ఇంతటి పర్ఫామెన్స్ దొరకడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి.. రోజంతా బయటే ఉంటూ ఫోన్ ఎక్కువ వాడేవారికి ఈ మోడల్ నానో పాకెట్ పవర్ బ్యాంక్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. సైజ్ కూడా చిన్నగా ఉండటం వల్ల ఈజీగా వాడొచ్చు. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కోరుకునే.. వారు ఈ గాడ్జెట్ వెంటనే కొనేయండి.
Also Read: 75 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో..గోబౌల్ట్ ఇయర్ బడ్స్!