E-Paper
Advertisement

పసిడి ప్రియులకు భారీ షాక్.. విలువైన లోహాల ధరలు పెరిగే ఛాన్స్, మార్కెట్లో రేటు మాటేంటి?

పసిడి ప్రియులకు భారీ షాక్.. విలువైన లోహాల ధరలు పెరిగే ఛాన్స్, మార్కెట్లో రేటు మాటేంటి?
Advertisement

Gold Price Today: అంతర్జాతీయ సంకేతాలు విలువైన లోహాలపై పడ్డాయి. ఫలితంగా బంగారం-వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. తులం బంగారంపై దాదాపు 6 నుంచి 7 వేలు వరకు ధర పెరిగింది. సిల్వర్ మెటల్ కూడా అదే పరిస్థితి. గడిచిన రెండురోజులుగా వెండి ధరలు రూ.15 వేలు వరకు ఎగబాకింది. రానున్న రోజుల్లో బంగారం-వెండి ధరలు పెరగడం ఖాయమని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

 

పసిడి-వెండి ప్రియులకు భారీ షాక్

Advertisement

కేవలం భారతీయులు మాత్రమేకాదు.. పెట్టుబడుదారులు సైతం బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పరిగణిస్తారు. ప్రపంచ మార్కెట్లు అనిశ్చితంగా ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ రాజకీయాల గురించి ఆందోళన చెందినప్పుడు పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు మొగ్గుచూపుతారు. గోల్డ్ విలువను నిల్వ చేసే సాధనంగా చూస్తారు. మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు పసిడి తన విలువను నిలుపుకోగలదని నమ్ముతారు. ద్రవ్యోల్బణం నుండి రక్షించడానికి ఉపయోగిస్తారు. అమెరికా డాలర్, బాండ్ ఈల్డ్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో బంగారం-వెండి రేట్లు పుంజుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయంగా కూడా రేట్లు ఎగబాకుతున్నాయి. వారం రోజులుగా ఒక్క రోజు బంగారం ధర కాస్త తగ్గింది. మిగతా అన్నిరోజులు భారీగా పెరుగుతూ వచ్చింది.

అమాంతంగా పెరిగిన ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ పసిడి రేటు ఔన్సుకు 4600 డాలర్లు దాటింది. సిల్వర్ ధర 69 డాలర్ల మార్కు వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 95.73 వద్ద ఉంది. ఆగస్ట్ 22న అంటే శనివారం ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1210 పెరిగి 10 గ్రాములకు రూ. 1,60,480 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1100 పెరిగి తులం రూ. 1,47,100 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు సిల్వర్ రేటు రూ. 5 వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీకి రూ. 2.65 లక్షల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ముందటి రోజు ధర పోల్చితే ఏకంగా రూ. 10 వేలు పెరిగింది. గడిచిన రెండురోజులుగా సిల్వర్ రేటు రూ. 15 వేలు ఎగబాకింది.

Advertisement

 

రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం?

ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1,60,630 వద్ద ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,47,250 వద్ద కొనసాగుతోంది. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతాల్లో 22 క్యారెట్లు తులం రూ. 147100, 24 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 160480 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. బంగారం ధరలు క్రమంగా పెరుగుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి రకరకాల వార్తలు రావడం, లోటు పెరిగిపోవడంతో కొన్నాళ్లపాటు బంగారం-వెండి ధరలు పెరగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాది కిందటితో పోల్చితే బంగారం ధర ఇప్పుడు 37.39 అధికంగా ఉందని, స్వల్పకాలంలో బంగారం ధర బలంగా పెరిగిందని చెబుతున్నాయి. ముందురోజుతో పోల్చితే దాదాపు 2 శాతం పెరిగినట్టు పేర్కొన్నాయి.

ALSO READ: ఎంత సంపాదిస్తే భారతీయులు సంతోషంగా ఉంటారు? డబ్బు, సంతోషం మధ్య లింక్ ఉందా?

Related News

టెలికాం రంగంలో సంచలనం.. 126 కోట్లకు చేరిన మొబైల్ యూజర్లు.. ట్రాయ్ రిపోర్టులో షాకింగ్ లెక్కలు!

పుట్టుకతో ఎడమ చేయిలేదు.. పట్టుదలతో చదివి రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగం

దసరాకు జియో ఐపీఓ.. ఒక్కో షేరు ధర ఎంత ఉండొచ్చు, మరి జీఎంపీ మాటేంటి?

ఆధార్‌ కార్డ్‌లో పేరు మార్చాలా? కొత్త రూల్స్ జారీ చేసిన ప్రభుత్వం.. పూర్తి ప్రాసెస్ ఇదే

మళ్లీ దిగుతున్న గోల్డ్-వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల మార్కెట్లో ధరల మాటేంటి?

20 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ EPS పెన్షన్ ఎంత వస్తుంది? ఇలా లెక్కించాలి

పోస్టాఫీసు సూపర్ డూపర్ స్కీమ్.. రోజూ రూ.300 దాస్తే చాలు.. చేతికి రూ.6.4 లక్షలు!

ఖరీదైన మెడిసిన్ అంటే మెరుగైన చికిత్స అని అర్థం కాదు.. మందులపై MRP, డిస్కౌంట్ల గుట్టు విప్పిన డాక్టర్

Big Stories

Advertisement
×