E-Paper
Advertisement

ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్‌ To 0 ఆల్ఫా EV.. హోండా క్రేజీ SUVలు రెడీ!

ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్‌ To 0 ఆల్ఫా EV.. హోండా క్రేజీ SUVలు రెడీ!
Advertisement

Honda Upcoming Cars 2026: భారత మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే దిశగా హోండా కార్స్ ఇండియా కొత్త మోడళ్లపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రెండు కొత్త SUVలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో ఒకటి ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్ కాగా, మరొకటి 0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఎలక్ట్రిక్ SUV. ఈ రెండు వాహనాలు ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్‌ లో కనిపించాయి.

ఎలివేట్‌కు కొత్త లుక్

హోండా ఎలివేట్ భారత మార్కెట్లో 2023 సెప్టెంబర్‌లో విడుదలైంది. ఇప్పుడు ఈ SUVకి తొలి కీలక అప్‌ డేట్ ఇవ్వడానికి కంపెనీ రెడీ అవుతోంది. ఇంజన్‌ లో పెద్ద మార్పులు చేయకుండా డిజైన్, ఇంటీరియర్, ఫీచర్ల విషయంలో మార్పులు చేసే అవకాశం ఉంది. కొత్త ఎలివేట్‌ లో ఫ్రంట్ గ్రిల్‌ ను రీడిజైన్ చేయడంతో పాటు హెడ్‌ ల్యాంప్స్, బంపర్లలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. వెనుక భాగంలో కూడా కొత్త డిజైన్‌తో కూడిన టెయిల్‌ ల్యాంప్స్‌ ను తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత మోడల్‌ తో పోలిస్తే ఫేస్‌లిఫ్ట్ మరింత లేటెస్ట్ గా కనిపించనుంది.

ఫీచర్లలోనూ అప్‌గ్రేడ్

Advertisement

ఇంటీరియర్‌లో కొత్త కలర్ స్కీమ్‌తో పాటు కొన్ని అదనపు ఫీచర్లు అందించే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా లాంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కెమెరా ఆధారిత ADAS, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు కొనసాగనున్నాయి.

ఇంజన్‌ లో నో ఛేంజెస్

ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్‌ లో ప్రస్తుత 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ నే కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 121hp పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదంటే CVT గేర్‌ బాక్స్ ఆప్షన్లు ఉంటాయి.

హోండా నుంచి తొలి ఎలక్ట్రిక్ SUV

Advertisement

అటు హోండా భారత మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ SUVని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. 0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా ఈ కొత్త EVని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెహికల్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUVని 2027 మార్చి నాటికి భారత్‌లో విడుదల చేయాలని కంపెనీ  భావిస్తోంది. 2027 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో సమయంలో దీనిని ఆవిష్కరించే అవకాశం కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUVను రాజస్థాన్‌లోని హోండా తపుకారా ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఉత్పత్తి మోడల్ అసలు 0 ఆల్ఫా కాన్సెప్ట్ డిజైన్‌కు దగ్గరగా ఉండే అవకాశం ఉంది.

హోండా ఇప్పటికే ఈ SUV వీల్‌బేస్ సుమారు 2,700 నుంచి 2,800 మిల్లీమీటర్ల మధ్య ఉంటుందని వెల్లడించింది. దీన్ని బట్టి ఇది మిడ్‌సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: కొనుగోలుదారులకు విన్‌ఫాస్ట్ షాక్.. VF7 ధర భారీగా పెంపు!

Tags

Related News

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

Big Stories

Advertisement
×