E-Paper
Advertisement

చైనాలో కప్పలు, పాములు తినడంపై కామాక్షి రియాక్షన్?

చైనాలో కప్పలు, పాములు తినడంపై కామాక్షి రియాక్షన్?
Advertisement

Kissik Talks:’ప్రియురాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ మోడల్, తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఈమె.. రీసెంట్ గా ఎమ్మెస్ రాజు (MS Raju) దర్శకత్వంలో ‘అగధ’ అనే సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతుండగా అటు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కామాక్షి బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసింది.

చైనాలో కప్పలు, పాములు తినడంపై వర్ష ప్రశ్న..

నిజానికి ఈమె చైనాలో ఎంబిబిఎస్ పూర్తి చేసి అపోలో హాస్పిటల్లో వైద్యురాలిగా కూడా పనిచేసింది. కానీ సినిమా పైన మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.. 2018లో చైనా నుండి ఇండియాకి వచ్చి మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ సొంతం చేసుకున్న కామాక్షి.. 2021లో ప్రియురాలు అనే చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. పొలిమేర 1&2 తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మరికొన్ని చిత్రాలు చేసి.. ఇప్పుడు అగధ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా కిస్సిక్ టాక్స్ లో సందడి చేసిన ఈమెను హోస్ట్ వర్ష.. చైనాలో కప్పలు, పాములు, తేళ్లు తింటారట. వాళ్లకేమీ కాదా? అని ప్రశ్నించింది.

Advertisement

ALSO READ:ప్రియురాలి మెడలో తాళి కట్టిన తెలుగు హీరో ప్రిన్స్.. ఫోటోలు వైరల్!

కామాక్షి క్రేజీ రియాక్షన్..

కామాక్షి మాట్లాడుతూ..” ఏమి అవ్వదు.. ఇక్కడ మనం ఎలాగైతే చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ తింటామో .. అక్కడ వాళ్లు కూడా అవి తింటారు. ముఖ్యంగా మనం చికెన్, మటన్ కి అలవాటు పడినట్లు వాళ్లు కూడా పాము, తేలు, కప్పలు తినడానికి అలవాటు పడిపోయారు. 200 సంవత్సరాల పాటు చైనా కరువులో ఉండిపోయింది. ఆ సమయంలో వాళ్లకు దగ్గరగా ఆ అనిమల్స్ మాత్రమే ఉండేవి. మనకు ఎలా అయితే చికెన్, మటన్, ఫిష్ అందుబాటులో ఉంటాయో.. వాళ్ళకు కప్పలు, పాములు, తేళ్లు వంటివి అందుబాటులో ఉంటాయి. వాళ్లకు ఒక జియోగ్రాఫికల్ కండిషన్ వల్ల ఆ అలవాటు వచ్చింది. అయితే మనం ఆ కల్చర్ కి కొంచెం దూరం కాబట్టి అలా అనిపిస్తుంది. అంతే తప్పించి వాటిని తింటే ఎవరికీ ఏమీ కాదు” అంటూ క్లారిటీ ఇచ్చింది.

చైనాలో ఉన్నప్పుడు ఆ ఫుడ్ టేస్ట్ చేశారా?

Advertisement

చైనాలో ఉన్నప్పుడు ఆ ఫుడ్ టేస్ట్ చేయడానికి నాకు కుదరలేదు. కానీ నేను ఉన్న ఏరియాలో ఎక్కువగా సీ ఫుడ్ దొరికేది. అక్కడ లభించే అన్ని రకాల సీ ఫుడ్ నేను ట్రై చేశాను. ముఖ్యంగా నా స్నేహితులు చైనా నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మన వంటకాలు వాళ్ళకి వండి పెడితే చాలా కారంగా ,తీపిగా అనిపించేది. ఎవరి కల్చర్ కి తగ్గట్టు వాళ్లకి ఆ అలవాటు వచ్చుంటుంది.. ముఖ్యంగా అన్ని కల్చర్స్ ని మనం గౌరవించాలి కదా అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.

ఫుడ్ హ్యాబిట్స్ పై కామాక్షి కామెంట్..

తన ఫుడ్ హ్యాబిట్స్ పై కూడా కామాక్షి చెబుతూ..”నేను అన్ని రకాల వెరైటీలు తింటాను. ముఖ్యంగా బిగ్ బాస్ తేజ తో ఇటీవల ఫుడ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు.. ఆయన నాతో చెప్పారు. నేను గత 13 ఏళ్లుగా ఫుడ్ పై ఇంటర్వ్యూలు సెలబ్రిటీలతో చేస్తున్నాను. కానీ ఇన్నేళ్లలో నన్ను బీట్ చేసింది మీరు మాత్రమే” అంటూ చెప్పారు. నేను ఫుడీ” అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది కామాక్షి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దెబ్బ కొట్టేందుకు మాలిని కొత్త ప్లాన్            

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు గుండెపోటు..వల్లి అడ్డంగా ఇరుక్కుందే.. భాగ్యంకు మైండ్ బ్లాక్..

Intinti Ramayanam Today Episode: ప్రణతి, భరత్ ల మధ్య చిచ్చు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. కమల్ ఏడ్పించేశాడు గా..

Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 14 స్ట్రీమింగ్..!

Ninnu kori Serial Today Episode October 9th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ గురించి ఇంట్లో వాళ్లకు నిజం చెప్పిన చంద్ర 

Friday Tv Movies : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…

సినీ, టీవీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

Big Stories

Advertisement
×