BigTV English

Business Idea: ఆడవారికి బెస్ట్ బిజినెస్..ఇంట్లోనే ఉంటూ, నెలకు రూ. 75 వేలు సంపాదించే ఛాన్స్

Business Idea: ఆడవారికి బెస్ట్ బిజినెస్..ఇంట్లోనే ఉంటూ, నెలకు రూ. 75 వేలు సంపాదించే ఛాన్స్

Business Idea: ఇంట్లోనే ఖాళీగా ఉండే అనేక మంది ఆడవారు బిజినెస్ చేయాలని అనుకుంటారు. కానీ ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయాలు తెలియక అలాగే ఉండిపోతారు. కానీ కొన్ని మెలకువలు తెలుసుకుని, చిన్న పెట్టుబడితో ఓ వ్యాపారం ప్రారంభిస్తే నెలకు రూ. 75 వేల వరకు సంపాదించవచ్చు. అవును మీరు చదివింది నిజమే. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఫుల్ డిమాండ్

అదే బ్యూటీ పార్లర్ బిజినెస్. దీనికి నగరాలల్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎలాగంటే ప్రతీ వేడుకకు, పార్టీలకు, పెళ్లిళ్లకు ఫేషియల్, హెయిర్ స్టైలింగ్ వంటి అనేక రకాల సేవల కోసం అడవారు బ్యూటీ పార్లర్ సందర్శిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంట్లోనే చిన్న స్థాయిలో బ్యూటీ పార్లర్ ప్రారంభించి, మంచి లాభాలను దక్కించుకోవచ్చు.


బ్యూటీ పార్లర్ వ్యాపారం ఎందుకు బెస్ట్
-తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు
-ఎలాంటి ప్రత్యేకమైన అనుభవం లేకపోయినా, తక్కువ సమయంలో ట్రైనింగ్ తీసుకుని నేర్చుకోవచ్చు
-స్థిరమైన ఆదాయం పొందే అవకాశముంది
-కాలంతో పాటు డిమాండ్ పెరుగుతుండడం
-పార్లర్ సేవలకు శాశ్వత డిమాండ్ ఉండటం

– ప్రస్తుతం ఫ్యాషన్, ట్రెండ్స్‌లో మార్పులు వచ్చినప్పటికీ బ్యూటీ పార్లర్ వ్యాపారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదని చెప్పవచ్చు. వివాహాలు, ఫంక్షన్లు, పండగలు, పార్టీలు ఇవన్నీ బ్యూటీ పార్లర్ సేవలకు ఎప్పుడూ డిమాండ్ కలిగిస్తున్నాయి.

ఒక చిన్న స్థాయి వ్యాపారం కావడంతో పెద్దగా అనుమతులు అవసరం ఉండదు.
GST రిజిస్ట్రేషన్ – మీ ఆదాయం ఏ స్థాయికి చేరుకున్నా, పన్నులు చెల్లించేందుకు ఇది అవసరం
ప్రాథమిక ట్రైనింగ్ సర్టిఫికెట్ – బ్యూటీ, మేకప్ సంబంధిత కోర్సు పూర్తి చేస్తే మీ నమ్మకం పెరుగుతుంది
పార్టీ, ఫంక్షన్‌లకు హోమ్ సర్వీస్ అనుమతి – కొన్ని ప్రాంతాల్లో హోమ్ సర్వీస్ ఇవ్వడానికి ప్రత్యేక అనుమతి అవసరమవుతుంది.

Read Also: Wireless Earbuds: బ్రాండెడ్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌పై 77% డిస్కౌంట్ ..

బ్యూటీ పార్లర్ ప్రారంభించడానికి పెట్టుబడి ఎంత?
బ్యూటీ పార్లర్ ప్రారంభించడానికి పెట్టుబడి మీ వ్యాపార స్థాయిని బట్టి మారుతుంది.
-ఇంట్లోనే చిన్న స్థాయిలో ప్రారంభిస్తే – రూ. 30,000 లోపు ఖర్చవుతుంది
-ప్రత్యేక షాప్ తీసుకొని ప్రారంభిస్తే – రూ. 1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య పెట్టుబడి అవసరం
-పూర్తి స్థాయి బ్యూటీ సెలోన్ ప్రారంభిస్తే – రూ. 4 లక్షల నుంచి రూ. 6 క్షల వరకు ఖర్చవుతుంది
-పెట్టుబడిలో అవసరమైన సామగ్రిలో మేకప్ కిట్, ఫేషియల్ కిట్, హెయిర్ కట్ కిట్, హెయిర్ డ్రయ్యర్, స్ట్రైట్‌నర్, రీఫ్లెక్షన్ మిర్రర్, ఫర్నిచర్ వంటివి అవసరమవుతాయి.

బ్యూటీ పార్లర్‌లో అందించవలసిన సేవలు
బ్యూటీ పార్లర్ ప్రారంభించిన తర్వాత మీరు అందించే సేవలు కింది విధంగా ఉంటాయి:
-హెయిర్ కటింగ్
-హెయిర్ స్టైలింగ్
-హెయిర్ కలరింగ్
-హెయిర్ స్పా

స్కిన్ కేర్ (Skin Care):
-షియల్
-స్కిన్ క్లీనింగ్
-బ్లీచింగ్
-మసాజ్

నెయిల్ కేర్ (Nail Care):
-మేనిక్యూర్
-పెడిక్యూర్
-నెయిల్ ఆర్ట్

మేకప్ (Makeup):
-పెళ్లి మేకప్
-పార్టీ మేకప్
-కంటి మేకప్
-హెయిర్ డిజైన్‌తో కలిపిన పూర్తి మేకప్

లాభాలు ఎలా ఉన్నాయంటే..
ఈ క్రమంలో మీరు ఈ వ్యాపారం ప్రారంభించిన తర్వాత రోజుకు ఐదు మందికి చేసినా కూడా, మీరు రూ. 75 వేలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఫేషియల్ లేదా మేకప్ వంటివి చేస్తే కనీసం రూ. 500 నుంచి రూ. 1000 వరకు తీసుకుంటారు. ఈ క్రమంలో మీరు రోజుకు ఐదుగురికి చేసినా కూడా నెలకు 150 మందికి చేసుకునే ఛాన్సుంది. ఈ క్రమంలో 150 మంది నుంచి కనీసం రూ. 500 తీసుకున్నా కూడా నెలకు రూ. 75 వేలు సంపాదించుకునే అవకాశం ఉంది. కస్టమర్ల సంఖ్య పెరిగితే లాభాలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×