మధ్యప్రదేశ్ లో సంచలన ఘటన జరిగింది. గిరిజనులు కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తిని విడిపించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపైనా స్థానికులు దాడి చేశారు. బందీని కొట్టి చంపడంతో పాటు అతడిని కాపాడేందుకు వెళ్లిన పోలీసుల ప్రాణాలు తీశారు. ఈ ఘటన భోపాల్ కు సుమారు 600 కిలో మీటర్ల దూరంలో ఉన్న మౌగంజ్ జిల్లా గద్రలో జరిగింది.
ఇతంకీ అసలు ఏం జరిగిందంటే?
కొన్ని నెలల క్రితం అశోక్ కుమార్ అనే కోల్ తెగకు చెందిన గిరిజనుడు హత్యకు గురయ్యాడు. పోలీసు రికార్డుల ప్రకారం ఆశోక్ కుమార్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ఉంది. కానీ, అతడిని చంపింది సన్నీ ద్వివేది అనే వ్యక్తి అని భావించారు. తాజాగా అతడిని కోల్ తెగకు చెందిన వాళ్లంతా కలిసి సన్నీని కిడ్నాప్ చేశారు. ద్వివేది అపహరణకు గురయ్యాడని పోలీసులకు సమాచారం అందింది. షాపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సందీప్ భారతీయ నేతృత్వంలోని బృందం అతడిని కాపాడేందుకు గాద్రాకు వెళ్లింది.
పోలీసులు వెళ్లే సరికే ద్వివేది హతం
సన్నీ ద్వివేదిని కిడ్నాప్ చేసిన కోల్ తెగ గిరిజనులు అతడిని ఓ గదిలో బంధించి విపరీతంగా కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక అతడు ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో పోలీసులు ఆ ఊరిలోకి అడుగు పెట్టారు. పోలీసులు అశోక్ కుమార్ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులకు కొమ్ముకాస్తున్నారంటూ గిరిజనులంతా ఏకమైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు. కొంత మంది ద్వివేదిని బంధించిన గదిలోనే బంధించి దాడి చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో గాయపడిన పోలీసులను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో ప్రత్యేక సాయుధ దళానికి చెందిన ASI చరణ్ గౌతమ్ తో పాటు మరో ఇద్దరు పోలీసులు చికిత్స పొందుతూ చనిపోయారు.
ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇక పోలీసులపై దాడి ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. “గిరిజనుల దాడిలో ఒక ASIతో సహా ఇద్దరు పోలీసులు మరణించారు. ఇతర పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసుల చుట్టుముట్టిన గిరిజన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది” అని రేవా రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సాకేత్ పాండే వెల్లడించారు.
STORY | MP: Cop killed after mob attacks police team trying to rescue man, who too dies
READ: https://t.co/rQDDIVid0R
VIDEO: “A dispute occurred between two groups in Gadra village. Section 163 has been imposed here and the situation is under control right now. We appeal to… pic.twitter.com/viQ7WJXnCH
— Press Trust of India (@PTI_News) March 15, 2025
గద్రలో భారీగా పోలీసు బందోబస్తు
అటు గద్రలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు మౌగంజ్ కలెక్టర్ అజయ్ శ్రీవాస్తవ, పోలీసు సూపరింటెండెంట్ రచనా ఠాకూర్ వెల్లడించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (ప్రజా శాంతిభద్రతల నిర్వహణ, అల్లర్లను నివారించడం)లోని సెక్షన్ 163ని ఈ ప్రాంతంలో అమలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. రెండు తెగల మధ్య గొడవ కారణంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పాటు పలువురి ప్రాణాలు పోయాయని ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Mauganj, Madhya Pradesh: SP Vivek Singh says, "An incident occurred in Shahpur police station, Mauganj district, involving a dispute between two parties. When the police arrived at the scene, stone pelting started, and some people were allegedly taken hostage, but the police… pic.twitter.com/s8glnDJBzQ
— IANS (@ians_india) March 16, 2025
Read Also: కాళ్లు చేతులు కట్టి, నీళ్లలో ముంచి.. కన్న బిడ్డలను కిరాతకంగా హత్య చేసిన తండ్రి!