Top post office schemes: పెట్టుబడులు పెట్టడానికి, డబ్బులను సేవింగ్ చేసుకోవడానికి పోస్టాఫీస్ స్కీంలు బాగా తోడ్పడుతాయి. ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు పోస్టాఫీస్ స్కీంలు చాలా ఉపయోగపడుతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 10 ఉత్తమమైన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి ఓసారి తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనేది రిటైల్ బ్యాంక్ అందించే సేవింగ్స్ ఖాతా. ఈ అకౌంట్ కోసం కనీసం రూ.500 బ్యాలెన్స్ అవసరం ఉంటుంది. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత రూ.50 నుంచి ఎంతవరకైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీం కింద వినియోగదారులకు 4 శాతం ఇంట్రస్ట్ లభిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా
పేదలు, మధ్య తరగతి కుటుంబాలు ఉపయోగపడే ఉత్తమమైన పోస్టాఫీజ్ సేవింగ్ ఖాతాలలో ఇది ఒకటి. ఈ నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్. ఇందులో నెలకు రూ.100 డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి వడ్డీని మూడు నెలలకు ఒకసారి కలుపుతారు. వార్షిక వడ్డి 6.7 శాతం లభిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్
దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుకోవాలి అనుకునే వారికి ఇది బెస్ట్ స్కీం. నేషనల్ సేవింగ్స టైమ్ డిపాజిట్ ఒకటి, రెండు, మూడు, ఐదేళ్ల కాల వ్యవధిలో అందుబాటులో ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కోరుకునే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ ఖాతాను మినిమమ్ రూ.1000లతో ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో ఇంట్రెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్
స్థిరమైన ఆదాయ వనరు కోసం వెతుకుతున్న వారు లేదా.. పదవీ విరమణ చేసిన వారికి ఇది బెస్ట్ స్కీం అని చెప్పవచ్చు. ఈ స్కీం ద్వారా ఖాతాదారులు తమ అకౌంట్లో రూ.9లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. అయితే ఉమ్మడి ఖాతాలో రూ.15లక్షల వరకు ఉండవచ్చు. ఈ స్కీం ద్వారా ఖాతాదారులు సుమారు 7 శాతం వడ్డీ పొందవచ్చు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
ఈ స్కీం ద్ద్వారా ఎక్కువ వడ్డీనే పొందే అవకాశం ఉంది. ఇందుల్ో రూ.1000 నుంచి రూ.30లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 60 ఏళ్లు దాటిన వారికి ఈ స్కీం ఎక్కువగా ఉపయోగపడుతోంది. వన్ టైం డిపాజిట్లకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. సాధారణ ఖర్చుల కోసం పెట్టుబడి రాబడిపై ఆధారపడే సీనియర్ సిటిజన్‌లకు మేలైనది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్ అకౌంట్)
దీర్ఘకాలిక పొదుపుల కోసం ఈ స్కీం ఎంతో ఉపయోగపడుతోంది. ఇందులో రూ.500 నుంచి రూ.1.5లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిపాజిట్టు ఏక మొత్తంలో లేదా వాయిదాలలో చేయవచ్చు. ఇది రిటైర్మెంట్ ప్లాన్ అండ్ ఇతర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.
సుకన్య సమృద్ది అకౌంట్(ఎస్ఎస్ఏ)
కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం ఈ స్కీం అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆడపిల్లల విద్య, భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ స్కీం ద్వారా గరిష్టంగా 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. ఫ్లెకిబుల్ డిపాజిట్ ఆప్షన్‌లతో ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.250 నుంచి రూ.1.5లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
భారతీయులలో పొదుపును అలవాటు చేయడానికి కేంద్రం ఈ స్కీంను తీసుకొచ్చింది. ఇందులో ఖాతాదారులు కనిష్టంగా రూ.1000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమి ఉండదు. ఇందులో ఖాతాదారుడు 7 శాతం కంటే ఎక్కువ ఇంట్రెస్ట్‌ను పొందవచ్చును.
కిసాన్ వికాస్ పత్ర
దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది బెస్ట్ స్కీం అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా పెట్టే పెట్టుబడి సుమారు 124 నెలల్లో రెట్టింపు అవుతోంది. ఇందులో కూడా పెట్టుబడి గరిష్ట పరిమితి ఏం ఉండదు. వడ్డీరేటు 7 శాతం కంటే ఎక్కువగానే ఉంటుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్
మహిళలకు ఆర్థికంగా ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రారంభించిన స్కీం ఇది. ఇందులో కనీసం పెట్టుబడి రూ.1000 కాగా.. గరష్టంగా రూ.2లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మహిళలకు ఇది బెస్ట్ స్కీం
Also Read: Railtel Jobs: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. భారీగా జీతం.. హైదరాబాద్‌లోనే జాబ్..
ముఖ్య గమనిక: పోస్టాఫీస్ స్కీంలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా వీటి గురించి తెలుసుకోండి. ఈ స్కీంలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే మీ దగ్గరలోని పోస్టాఫీసును సందర్శించండి. ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న తరుణంగా ఇన్వెస్ట్ చేయడానికి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.