BigTV English

Aamir Khan: మల్టీప్లెక్స్ తీరుపై మండిపడిన అమీర్ ఖాన్… పద్ధతి మార్చుకోవాలంటూ!

Aamir Khan: మల్టీప్లెక్స్ తీరుపై మండిపడిన అమీర్ ఖాన్… పద్ధతి మార్చుకోవాలంటూ!

Aamir Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సినీ నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan)ఒకరు. అమీర్ ఖాన్ కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో అమీర్ ఖాన్ కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ మల్టీప్లెక్స్ థియేటర్ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.


స్క్రీనింగ్ సమయంలో వద్దు…

మన ఇండియా సినీ ఇండస్ట్రీలో మల్టీప్లెక్స్ (Multiplex) సంస్కృతి ప్రారంభమై దాదాపు మూడు దశాబ్దాల కాలం అవుతుంది. ఇలా మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పాలి. అయితే మల్టీప్లెక్స్ థియేటర్లలో ఫుడ్ గురించి తాజాగా అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాకుండా ఈ చర్యలను వ్యతిరేకించారు. సినిమా థియేటర్లలో ప్రేక్షకులు సినిమాని ఆస్వాదిస్తున్న సమయంలో స్వయంగా ప్రేక్షకులు ఆర్డర్ చేసిన ఫుడ్ స్క్రీనింగ్ సమయంలోనే వారి వద్దకు తీసుకు వస్తున్నారు. అయితే ఇది సరైనది కాదని తన అభిప్రాయాన్ని తెలిపారు.

చిరాకు తెప్పిస్తాయి…


ఇలా స్క్రీనింగ్ సమయంలో స్నాక్స్ సర్వీస్ చేయడం తనను చాలా బాగా కలిగించిందని తెలిపారు. ఒకవేళ మీరు స్నాక్స్ కొనుగోలు చేయాలి అనుకుంటే స్క్రీనింగ్ కి ముందు లేదా విరామం సమయంలో స్నాక్స్ కొనుగోలు చేయండి కానీ ఇలా స్క్రీనింగ్ సమయంలో స్నాక్స్ కొనుగోలు చేయడం వాటిని సర్వీసింగ్ చేయడం మానుకోవాలని తెలిపారు. ఇలా స్నాక్స్ కూల్ డ్రింక్స్ అమ్మడం వల్ల కొంతమేర ప్రేక్షకులకు ఈ చర్యలు చిరాకు తెప్పిస్తాయి. ఇలాంటి చర్యలను మానుకోవాలని తాను పలు సందర్భాలలో మల్టీప్లెక్స్ యాజమాన్యులకు తెలియజేశానని వెల్లడించారు.

ఫుడ్ సర్వీసింగ్ మానుకోవాలి…

ఇది థియేటర్ యాజమాన్యం వ్యాపారం దృక్పథంతో చూసిన సినిమా చూసే ప్రేక్షకులకు మాత్రం ఆ అనుభవాన్ని చంపేస్తుందని తెలిపారు. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడి దృష్టి సినిమా పైనే దృష్టి పెట్టడానికి వీలుగా ఉండాలి అంటే ఇలాంటి పద్ధతులను మానుకోవాలని సూచించారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్ లో ఫుడ్ సర్వీసింగ్ గురించి అమీర్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది ఈయనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక గతంలో కూడా అమీర్ ఖాన్ మల్టీప్లెక్స్ లో స్నాక్స్ ధరలపై కూడా స్పందించారు. ఇలా స్నాక్స్ పై అధిక ధరలు ఉన్న నేపథ్యంలో చాలామంది థియేటర్ కు దూరమవుతున్నారు అంటూ ఈయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇక అమీర్ ఖాన్ ప్రస్తుతం పలు సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈయన చివరిగా రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో క్యామియో పాత్రలో కనిపించి సందడి చేశారు.

Also Read: Avika Gor: పెళ్లి పీటలు ఎక్కబోతున్న చిన్నారి పెళ్ళికూతురు.. ముహూర్తం ఫిక్స్!

Related News

OG Trailer: పేల్చిపడేస్తాం… ట్రైలర్ లేట్ అయితే సారీ చెప్పలేదు.. కానీ, బాగా కవర్ చేశారు!

 Kalki2 : దీపిక ప్లేస్‌లో స్వీటీ… మళ్లీ పెళ్లి వార్తలు వచ్చేస్తాయేమో

Venky – Trivikram: వెంకీ మామ టైం వచ్చేసింది… గురూజీ పక్కా ప్లాన్‌

Sujeeth: ఆయన వల్లే ఈ స్థాయి.. సుజీత్ ఎమోషనల్ కామెంట్స్!

Kamal Haasan: సభలకు వచ్చే వాళ్లంతా ఓటేయరు.. హీరో విజయ్‌కి కమల్‌ కౌంటర్‌!

Chiranjeevi: కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను.. 47 ఏళ్ల నట ప్రస్థానానికి పునాది

Avika Gor: పెళ్లి పీటలు ఎక్కబోతున్న చిన్నారి పెళ్ళికూతురు.. ముహూర్తం ఫిక్స్!

Big Stories

×