BigTV English
Advertisement

Daku maharaj : బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే! పొట్టేలు బలి.. మెన్షన్ హౌస్ తో అభిషేకం.. రచ్చ మామ్మూలుగా లేదుగా

Daku maharaj : బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే! పొట్టేలు బలి.. మెన్షన్ హౌస్ తో అభిషేకం.. రచ్చ మామ్మూలుగా లేదుగా

Daku maharaj : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Bala Krishna) నటించిన ‘డాకు మహారాజ్’ (Daku maharaj) మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ కు ఒక్క రోజు ముందే సంక్రాంతి వచ్చేసింది. ఏపీలో బెనిఫిట్ షోలకు థియేటర్ల వద్ద అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక తిరుపతిలో అయితే బాలయ్య అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బాలయ్య కటౌట్ కు మెన్షన్ హౌస్ తో అభిషేకం చేసి.. పొట్టేలును బలిచ్చారు. టెంకాయలు కొడుతూ డాన్స్ చేస్తూ టపాసులు కాలుస్తూ హడావిడి చేశారు.


బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ దగ్గర హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో సంక్రాంతి కానుకగా విడుదలయ్యే సినిమాకు ఉండే హైపే వేరు. థియేటర్స్ దగ్గర భారీ కటౌట్స్ తో పాటు పాలాభిషేకాలు, రక్తాలతో తిలకాలు దిద్దటం చేస్తూ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక ఇప్పుడు తాజాగా రిలీజైన డాకు మహరాజ్ హిట్ టాక్ తో ఫ్యాన్స్ మరిన్ని సంబరాల్లో మునిగిపోయారు. ఏపీలో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.

సంక్రాంతి కానుకగా విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్’ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియోట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుమ్మురేపిన బాలయ్య, డాకు మాహారాజ్ సూపర్ హిట్ అంటూ తెగ హల్చల్ చేస్తున్నారు. తిరుపతిలో రెచ్చిపోయిన ఫ్యాన్స్ బాలయ్య భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దానికి మందుతో అభిషేకం చేస్తూ పొట్టేలును బలి ఇచ్చారు. డీజే డాన్సులు వేస్తూ.. బాలయ్య కటౌట్ కు హారతి పట్టారు. ఇక జై బాలయ్య.. జై జై బాలయ్య.. డాకూ మహరాజ్ సూపర్ హిట్ అంటూ తెగ హడావిడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.


ఇక సంక్రాంతికి బాలకృష్ణ సినిమా వస్తుందంటే థియేటర్ దగ్గర కనిపించే సందడే వేరు. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అటు మాస్ ఫాన్స్ ని సైతం ఉర్రూతలూగించే బాలయ్య సినిమాలు ఎన్నో సంక్రాంతి బరిలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించాయి. ఇక ఈ ఏడాది డాకు మహారాజ్ తో సంక్రాంతి బరిలో దిగారు బాలకృష్ణ. నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా అమెరికాలో సైతం హిట్ టాక్ తో దూసుకుపోతుంది. యువ దర్శకుడు బాబి కొల్లి తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకుంటుంది.

బాలయ్య కు జోడిగా శ్రద్ధ శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశీ రౌతులా కనిపించారు. అయితే కథని మలుపు తిప్పే పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ కనిపించినప్పటికీ, ప్రజ్ఞా జైస్వాల్ నిడివి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఊర్వశీ రౌతులా దబిడి దబిడి పాటతో సినిమాకే సరికొత్త అందాన్ని తీసుకొచ్చేసింది.

ALSO READ : గేమ్ ఛేంజర్ పై దిల్ రాజు ఎమోషనల్ ట్వీట్..!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×